లిరికల్ వీడియో: పదరా అంటున్న మహర్షి

Update: 2019-04-24 11:23 GMT
గత రెండు రోజులుగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహర్షి ఆడియోలోని నాలుగో పాట పదరా పదరా విడుదలైంది. సుప్రసిద్ధ గాయకుడు శంకర్ మహదేవన్ గాత్రంలో శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఫైనల్ గా ఫ్యాన్స్ కోరుకున్న రీతిలో అలరించే విధంగా ఉంది. పాట మొత్తం రైతన్నలకు స్ఫూర్తినిచ్చేలా సాగింది.

 కరువులో అల్లాడుతూ వాన చినుకు కోసం ఎదురు చూస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళను ఓదార్చేలా మహర్షి అనే అండ ఉందని ధైర్యం కలిగించేలా చక్కగా కంపోజ్ చేశారు. పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా అంటూ సాగే పల్లవిలో భూమి తల్లిని నమ్మి సాగితే ఎంత ఫలితం ఉంటుందో పదాల్లో చెప్పే ప్రయత్నం చేశారు

శంకర్ మహదేవన్ గాత్రం పాటకు నిండుతనం తెచ్చింది. ళ అక్షరాన్ని పలకలేక దాన్ని లా గా మారుస్తున్న ఇప్పటి కొందరు గాయని గాయకులకు అర్థం అయ్యేలా పాడిన తీరు బాగా వచ్చింది. సాహిత్యం అంతా మహర్షిగా మహేష్ పొలంలో దిగి రైతులతో పాటు భూమిలోనుంచి బంగారం లాంటి పంటను ఎలా సాగు చేయలన్న లక్ష్యంతో సాగడాన్నే పొందుపరిచారు.

లిరికల్ వీడియో అయినప్పటికీ మధ్యలో ఆధునిక రైతు వేషంలో మహేష్ కట్టుతీరుతో పొందుపరిచిన విజువల్స్ అదుర్స్ అనేలా ఉంది. శ్రీమంతుడులో కొంత జాగో పాట తరహలో అనిపించినప్పటికీ దేవి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మొత్తానికి ఇప్పటిదాకా రిలీజైన ట్రాక్స్ లో ఇదే హుషారునిచ్చే గీతంగా చెప్పుకోవచ్చు.


Full View
Tags:    

Similar News