• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల...

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల మాయాజాలం.. అలా ఉందట

By - Tupaki Desk
Update: 2019-12-27 09:06 GMT
టాలీవుడ్ సినిమాల కు తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా మార్కెట్లు ఉన్నాయి. వాటిలో ఓవర్సీస్ మార్కెట్ ఒకటి. అయితే మిగతా ఏరియాలకు ఓవర్సీస్ మార్కెట్ భిన్నమైనది. ఇక్కడ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో విజయం సాధిస్తాయని గ్యారెంటీ లేదు. ఈ మధ్య  స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఫ్లాప్స్ గా నిలుస్తూ ఉండడం తో ఓవర్సీస్ లో అన్నీ సినిమాలు నష్టాలు తీసుకొస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అది అందరూ నిజమనే నమ్ముతున్నారు.

ఈ ఏడాది మొత్తానికి మూడు.. జస్ట్ మూడు తెలుగు సినిమాలు మాత్రమే అమెరికా లో హిట్ అయ్యాయని.. మిగతావన్నీ ఫ్లాపులేనని ఈమధ్య కథనాలు వస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేగా ఉందట. ఈ ఏడాది ఎక్కువ సినిమాలు ఓవర్సీస్ లో విజయం సాధించాయట. అయితే వాటికి ఫ్లాప్ అనే ముద్ర వేశారట. ఎక్కువమంది యూఎస్ డిస్ట్రిబ్యూటర్ల కు కొమ్ము కాసే కొని వెబ్ సైట్లు ఇలాంటి ప్రచారం చేపడుతూ నిర్మాతలను మభ్య పెడుతున్నారట. నిజానికి ఇలాంటి ప్రచారం తోనే ఓవర్సీస్ రైట్స్ ధరలను ఇప్పటికే పాతాళానికి తీసుకొచ్చారట. ఇంకా వీటిని కిందకు తీసుకు పోయి.. ఫిబ్రవరి లో విడుదల కాబోయే సినిమాల రైట్స్ ను నామ మాత్రపు ధరలకే చేజిక్కించుకునేలా ఈ ఎత్తుగడ వేశారట. యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే ప్రచారం తో తెలుగు నిర్మాతలను బెదరగొట్టి అక్కడ పాతుకు పోయిన డిస్ట్రిబ్యూటర్ల కు మేలు చేసేందుకు ఈ వెబ్ సైట్లు ఇలాంటి ప్రచారం చేపట్టాయట.

యూఎస్ లో సినిమాల కు ఎక్కువ గా నష్టాలు వస్తున్న మాట నిజమే కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ అమాయకంగా నిర్మాతలు ఏ రేట్ చెప్తే ఆ రేట్ కు గుడ్డిగా సినిమా రైట్స్ కొనడం లేదు. సినిమా ఫ్లాప్ అయినా తాము సేఫ్ జోన్ లో ఉండే రేట్ల కు సినిమాలను కొంటున్నారట. ఈ విషయాల ను నిర్మాతలు గ్రహించి తమ సినిమాలకు వాస్తవంగా ఎంత మార్కెట్ ఉందో స్వయంగా రంగంలోకి దిగి తెలుసుకోవాలని.. కొందరు దేశముదురు డిస్ట్రిబ్యూటర్లు.. కొన్ని వెబ్ సైట్ లు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని ఓవర్సీస్ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెప్తున్నారు.
Tags:    
  • Tollywood Overseas Distributors 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS