మాలీవుడ్ ని చూసి మన స్టార్ హీరోలు - ఇండస్ట్రీ ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది..!!
మాలీవుడ్ ఇండస్ట్రీ కంటెంట్ బేస్డ్ సినిమాలకు.. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. లిమిటెడ్ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి జాతీయ స్థాయిలో మెప్పు పొందుతున్నారు. ఓటీటీల పుణ్యమాని ఇప్పుడు మలయాళ సినిమాలు అన్ని భాషల వారికి చేరుతున్నాయి. గత రెండేళ్లుగా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్ కాబడి విశేష ఆదరణ దక్కించుకున్నాయి. సినిమాల కంటెంట్ గురించే అని కాకుండా చాలా విషయాల్లో మలయాళ ఇండస్ట్రీని చూసి.. అక్కడి స్టార్ హీరోలను చూసి మన ఇండస్ట్రీ మరియు మన స్టార్ హీరోలు ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది.
మలయాళ స్టార్ హీరోలందరూ వరుస సినిమాలు చేస్తుంటే ఏడాది పొడవునా బిజీగా ఉంటారు. ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు కచ్చితంగా చేస్తారు. ఎన్ని సినిమాలు చేసినా ఓ పద్ధతి ప్రకారం అన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అక్కడ థియేటర్ - ఓటీటీ అంటూ గొడవలు.. సర్దుబాట్లు లేవు. దీంతో అక్కడ స్టార్ హీరోలు తమ సినిమాలను కుదిరితే థియేటర్ లో లేదా డిజిటల్ లో రిలీజ్ చేస్తుంటారు. గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో పెద్ద హీరోల సినిమాలు ఓటీటీ బాట పట్టాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ''దృశ్యం 2'' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదల చేయగా.. ట్రెమాండ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక మాలీవుడ్ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ రెండు నెలలకో సినిమా చేస్తున్నాడు.. వాటిలో కొన్నింటిని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 'సి యూ సూన్' 'ఇరుల్' 'జోజి' వంటి చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసిన ఫహాద్.. ఇప్పుడు ''మాలిక్'' అనే మరో చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ కు రెడీ చేశారు. జూలై 15 నుంచి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సస్ట్రీమింగ్ చేయనున్నారు.
అలానే మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ''కోల్డ్ కేస్'' ను రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీ మాదిరిగా పారితోషికాలు - సినిమా బడ్జెట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా సినిమాలు చేస్తే తెలుగులో కూడా సక్సెస్ రేటు పెరిగే అవకాశం ఉంది. స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలతో పాటుగా కంటెంట్ బేస్డ్ చిత్రాలు కూడా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరి రాబోయే రోజుల్లో ఆ దిశగా అలాంటి ప్రయాణాలు కొనసాగుతాయేమో చూడాలి.