నటకిరీటి గారు.. ఏంటండీ ఈ వేషాలు?

Update: 2018-02-13 06:47 GMT
అప్పట్లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎంతగా నవ్వించే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలంటే మినిమామ్ కామెడీ అండ్ ఎమోషన్ ఉండేది. దీంతో బోర్ కొట్టేది కాదు. అయితే రాను రాను ఆయన సినిమాలకి మార్కెట్ తగ్గిపోయింది. అలా అని ఆయన నటనకు దూరం కాలేదు. ఇతర సినిమాల్లో సహా నటులుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అయితే అప్పుడప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలను చూస్తుంటే మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయం ఎవ్వరికి అర్థం కావడం లేదు. రీసెంట్ గా ఆయన ఎంచుకున్న ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఊ.పె.కు.హ ట్యాగ్ లైన్ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అనే ఈ సినిమా ట్రైలర్ లో బూతు తప్ప ఎక్కడా స్పెషల్ ఏమి కనిపించడం లేదు. ట్రైలర్ గురించి వర్ణించడం కూడా కొంచెం కష్టమే. అంతే కాకుండా ఈ లేటు వయస్సు లో రాజేంద్రప్రసాద్ గారికి అంత ఘాటైన సినిమాలు అవసరమా అని అనిపిస్తోంది. పైగా హీరోయిన్ సాక్షి చౌదరితో ఆయన మొరటు రొమాన్స్ ఒకటి. వామ్మో!!

గతంలో ఆయన చేసిన సినిమాలకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ నలుగురు - మీ శ్రేయోభిలాషి వంటి మంచి సినిమాలు రాజేంద్రప్రసాద్ చేశారు. అంతే కాకుండా సహనటులుగా స్టార్ హీరోల సరసన ప్రస్తుతం సత్తా చాటుతున్నారు కూడా. కానీ ఈ ట్రైలర్ చూశాక మొదటి సారి రాజేంద్రప్రసాద్ గారి సినిమా అంటే విరక్తి కలుగుతోందని నెటీజన్స్ ఓ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆయనకు ఇలాంటి వేషాలు అవసరమా అంటున్నారు.

Full View
Tags:    

Similar News