• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిరుమలను మళ్లీ ఎలా...

తిరుమలను మళ్లీ ఎలా కట్టేశారంటే..

By - Tupaki Desk
Update: 2017-02-13 10:30 GMT
పీరియాడికల్ చిత్రాలతో.. వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఆధారిత సినిమాలు తీయడంలో ఎదురయ్యే ప్రధాన సమస్య లొకేషన్స్. అన్ని వందల ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆనవాళ్లు కూడా అంతగా లభించవు. తాజాగా విడుదల అయిన నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయకు కూడా ఇదే సమస్య ఎదుర్కున్నామని చెబుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్.

తిరుమల గర్భగుడి సెట్ ను ఎక్కడైనా వేయచ్చన్న ఆయన.. గోపుర ప్రాంగణం.. తిరు వీధుల విషయంలో మాత్రం లొకేషన్ కోసం ఇబ్బంది ఎదుర్కున్నట్లు చెప్పాడు. చాలాప్రాంతాలు తిరిగిన తర్వాత చివరకు రామోజీ ఫిలింసిటీ అనువుగా ఉంటుందని భావించి.. అక్కడే కేవలం ఆరు రోజుల్లోనే గోపురం సహా గుడి ప్రాంగణాన్ని నిర్మించేశారట.  ఈ సమయంలోనే రెండు వెయ్యి కాళ్ల మండపాలు.. గోపురం.. ప్రాకార మండపం.. పురవీధులు కూడా నిర్మించామని చెప్పాడు. ఐదొందల ఏళ్ల క్రితం గోపురం.. ఆ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు టీటీడీ లైబ్రరీ సహా అనేక రిఫరెన్సులను చూసుకున్నారట.   

అప్పటి కాలాన్ని ప్రతిబింబించేందుకు చెక్క.. ఫైబర్.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను మాత్రమే ఉపయోగించామని చెప్పాడు ఆర్ట్ డైరెక్టర్. ఓం నమో వేంకటేశాయ కోసం.. మొత్తం 25 సెట్స్ వేశామని.. అన్నిటిలోను గోపురం ప్రాకారం బాగా నచ్చిందన్నారు కిరణ్ కుమార్. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా పాట కోసం.. మహాబలేశ్వరంలో పది ఎకరాల్లో పూల తోట పెంచారట. ఆ పాటలో ఉపయోగించిన పూలలో కొన్ని మినహాయిస్తే.. అన్నీ నిజమైనవే కావడం విశేషం. ప్రతీ రోజూ 8 లోడ్లు పూలు తెప్పించి ఆ పాట తీయబట్టే.. అంత గొప్పగా ఆ సాంగ్ వచ్చిందంటున్నాడు కళా దర్శకుడు కిరణ్ కుమార్.
Tags:    
  • Om Namo Venkatesaya 
  • Tirumala Temple Set 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS