నాగ్ బాబా.. డేట్ ఫిక్స్

Update: 2016-12-04 06:17 GMT
అక్కినేని నాగార్జున వరుస సక్సెస్ ల తర్వాత డిఫరెంట్ జోనర్ లో భక్తిరస మార్గంలోకి ఎంటర్ అయిపోయాడు. 'ఓం నమో వెంకటేశాయ' అంటూ తెరకెక్కుతున్న చిత్రంలో హథీరాం బాబాగా నటిస్తున్నాడు నాగార్జున.

ఇప్పటివరకూ అయితే.. ప్రతీ సినిమాకి రిలీజ్ డేట్ ముందే అనుకుని మరీ షూటింగ్ చేశారు కానీ.. పెద్ద నోట్ల రద్దు దెబ్బకి తేడా కొట్టేసింది. పొంగల్ కి షెడ్యూల్ చేసిన సినిమాలు తప్పితే.. మిగిలినవన్నీ రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సి వచ్చింది. మారిన తేదీ విషయంలో కూడా పోటీ రాకుండా ఉండేందుకు.. నాగ్ కాస్త అడ్వాన్స్ అయ్యాడు. అందులో భాగంగా తన చిత్రాన్ని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించేసింది యూనిట్.

ఇప్పటికే జనవరి రిలీజ్ లపై క్లారిటీ ఉండగా.. ఇప్పుడు ఫిబ్రవరి కోసం కూడా క్యూ స్టార్ట్ చేసేశాడు నాగార్జున. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయకు.. బహుశా పోటీ వచ్చే సినిమాలేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నాగ్ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. కృష్ణమ్మగా అనుష్క చేస్తున్న భక్తురాలి రోల్ స్పెషల్ హైలైట్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News