చిరుతో హిట్టు కొడితే మ‌హేష్ కాంపౌండ్ లో ఆఫ‌ర్?

Update: 2021-03-30 02:30 GMT
ఆచార్య త‌ర్వాత మెగాస్టార్ వ‌రుస‌గా మూడు సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మోహ‌న్ రాజా- బాబి- మెహ‌ర్ ర‌మేష్ .. ముగ్గురూ స్క్రిప్టులు రెడీ చేసి బ‌రిలో దూకేందుకు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. అయితే ఈ ముగ్గురిలో తొలిగా మోహ‌న్ రాజాతో లూసీఫ‌ర్ రీమేక్ వేగంగా పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్.

ఆ త‌ర్వాత బాబి సినిమాని ప్రారంభిస్తారా?  లేక మెహ‌ర్ ర‌మేష్ తోనే ముందుకెళ‌తారా? అన్న‌దానిపై పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు. కొర‌టాల‌తో ఆచార్య పెండింగ్ చిత్రీక‌ర‌ణ ముగించి త‌దుప‌రి లైన‌ప్ గురించి చిరు క్లారిటీ ఇస్తార‌నే ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా వెయిటింగ్.

అయితే తాజా స‌మాచారం మేర‌కు.. బాబి- మెహ‌ర్ ర‌మేష్ ఇద్ద‌రి సినిమాల్ని ఇంచుమించు ఒకేసారి ప్రారంభించి షెడ్యూల్స్ ప్ర‌కారం అటూ ఇటూ లొకేష‌న్ల‌కు మార‌తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ రెండిటినీ ఎక్కువ గ్యాప్ తీస్కోకుండా రెండు నెల‌ల తేడాలోనే రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ కూడా ఉంది.

చాలా గ్యాప్ త‌ర్వాత మెహ‌ర్ కి ఇది పెద్ద అవ‌కాశం. అందుకే ఇత‌రుల‌తో పోలిస్తే అత‌డు ఎక్కువ ఆశ‌గా.. అంత‌కుమించిన ఆస‌క్తితో వేచి చూస్తున్నారు‌. వేదాళం రీమేక్ స్క్రిప్టును వంద శాతం ప‌ర్ఫెక్ష‌న్ తో బాస్ కి న‌చ్చేలా మెహ‌ర్ తీర్చిదిద్దార‌ట‌. ఒక‌వేళ ఈ సినిమాతో హిట్టు కొడితే అత‌డికి వెంట‌నే మ‌హేష్ కాంపౌండ్ లోనూ ఆఫ‌ర్ ఉంటుంది. న‌మ్ర‌త - మ‌హేష్ బృందంతో అత‌డు క్రియేటివ్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేస్తూ వారితోనూ క్లోజ్ గా అసోసియేట్ అయ్యి ఉండ‌డం అత‌డికి పెద్ద ప్ల‌స్ కానుంద‌ని చెబుతున్నారు. 2022 అత‌డికి బిగ్ ఇయ‌ర్ అవుతుంద‌న్న అంచ‌నా ఉంది.
Tags:    

Similar News