అక్కినేని హీరో సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారా...?
అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. ఇది అఖిల్ కెరీర్ కి ఐదో సినిమా కాగా.. సురేందర్ రెడ్డికి పదో సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని 'సరిలేరు నీకేవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. అఖిల్ - సురేందర్ రెడ్డి స్టైలిష్ కాంబోపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ కానుందని సమాచారం.
కాగా, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ కోసం నిర్మాతల్లో ఒకరైన సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారట. ఈ స్టైలిష్ థ్రిల్లర్ కోసం సుమారు 40 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారట. అయితే అంత బడ్జెట్ అఖిల్ మీద వర్కౌట్ అవుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అఖిల్ ఫస్ట్ మూవీ 'అఖిల్' ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో తీశారు. కానీ ఇప్పుడు #Akhil5 కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ వస్తున్న సురేందర్ రెడ్డి.. అఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా బడ్జెట్ లెక్కలు వేస్తున్నారని సినీ వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఈ స్టైలిష్ కాంబో అందరి అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.