• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NTR30 ఆలస్యం.. అసలు రీజన్...

NTR30 ఆలస్యం.. అసలు రీజన్ ఇదన్నమాట

By - Tupaki Desk
Update: 2022-08-10 09:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ స్టార్ట్ చేయవలసిన ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుంది. అసలు సమ్మర్ చివరలోనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని అనుకున్నారు.

కానీ వివిధ కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. దానికి తోడు ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ పై మరింత ఒత్తిడి తెచ్చాడు అనే టాక్ కూడా వచ్చింది. ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం RRR సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఎందుకంటే రాజమౌళి RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎన్నో సెంటిమెంట్స్ ఈ కాంబినేషన్ పై హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయినా సరే డిజాస్టర్ అందుకోవాల్సిందే అనే సెంటిమెంట్ ఈపాటికి రామ్ చరణ్ పై ప్రభావాన్ని చూపించింది. ఆచార్య సినిమా బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ నీ దాటేసి రావాల్సి ఉంది.

అయితే గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ పెయిన్ రావడం వలన కొంత ట్రీట్మెంట్ అవసరమని అందుకే ఇంకా కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలు కావడం లేదు అని రూమర్స్ అయితే గట్టిగానే వినిపించాయి.

అయితే నిజానికి అందులో నిజం లేదు అని ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కొరటాల శివ ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేయలేదు అని అలాగే ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ కూడా ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తుంది.

ఆ కారణంగానే ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు అని సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మాత్రం గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్టును అనుకున్న విషయం తెలిసిందే. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
Tags:    
  • NTR30 
  • KoratalaSiva 
  • Tarak 
  • RRR 
  • Acharya 
  • SSRajamouli 
  • RamCharan 
  • PrashantNeel 
  • MovieNews 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS