మెగా హీరో కోసం మరోసారి ఎన్టీఆర్‌ గాత్రం

Update: 2022-12-06 02:30 GMT
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా నుండి అప్పుడే అప్డేట్‌ రాబోతుంది.

టైటిల్ తో పాటు సినిమా లో సాయి ధరమ్‌ తేజ్ యొక్క లుక్ ను గ్లిమ్స్ రూపంలో విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో కు యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది. అందరి అంచనాలు పెంచే విధంగా సాయి ధరమ్‌ తేజ్ సినిమా గ్లిమ్స్ కు ఎన్టీఆర్ వాయిస్‌ ఉంటుందని అంటున్నారు.

ఎన్టీఆర్‌ వాయిస్‌ తో మెగా మూవీ రావడం చాలా స్పెషల్‌. ఆ మధ్య రామ్‌ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్ తో పరిచయం చేసిన వీడియో ఎంతటి వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ వీడియోలో రామ్‌ చరణ్ విజువల్స్ కు ఎంతగా ఆధరణ దక్కిందో.. ఎన్టీఆర్‌ యొక్క వాయిస్‌ కు కూడా అంతే ఆధరణ దక్కింది. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్ తో సాయి ధరమ్‌ తేజ్ యొక్క సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయితే కచ్చితంగా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News