కొరటాలను ఛట్రంలో బిగించకండి-ఎన్టీఆర్

Update: 2016-08-30 11:30 GMT
కొరటాల శివలో చాలా డైమన్షన్లు ఉన్నాయని.. అతణ్ని యాక్షన్ డైరెక్టర్ అనో.. కమర్షియల్ డైరెక్టర్ అనో ఒక ముద్ర వేసి.. ఒక ఛట్రంలో బిగించడం సరి కాదని ఎన్టీఆర్ అన్నాడు. కొరటాలతో కొన్నేళ్లుగా తాను ట్రావెల్ అవుతున్నానని.. అతను రచయితగా.. దర్శకుడిగా కంటే తనకు వ్యక్తిగా మరింత ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. కొరటాల నుంచి భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘ఇప్పటిదాకా కొరటాల తన సినిమాలతో చూపించింది చాలా తక్కువ. అతడిలో ఇంకా చాలా డైమన్షన్లు ఉన్నాయి. అతడిపై ఒక ముద్ర వేయకూడదన్నది నా అభిప్రాయం. నాకు దర్శకుడిగా.. రచయితగా కంటే కొరటాల ఒక వ్యక్తిగా బాగా ఇష్టం. అతడికి సమాజం పట్ల ఓ బాధ్యత ఉంటుంది. తన సినిమాల్లో కనిపించే మంచి ఆలోచనలన్నీ తన వ్యక్తిత్వం నుంచి వచ్చినవే. అతను బేసిగ్గా చాలా ఎమోషనల్.

ఎప్పుడూ మంచి విషయాలే ఆలోచిస్తాడు. అవే తెరమీదా చూపిస్తాడు. ‘బృందానవం’ నుంచి కొరటాలతో ట్రావెల్ అవుతున్నాను. అతణ్ని దగ్గరగా చూశాను. ఎంతో తపన ఉన్న వ్యక్తి. ఇప్పటిదాకా అతను తీసిన సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఐతే అతను మున్ముందు మరింత గొప్ప సినిమాలు చేస్తాడు. అతడి దగ్గర ఇంకా చాలా ఆలోచనలున్నాయి. తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టే మరిన్ని సినిమాలు చేస్తాడని నా నమ్మకం’’ అని ఎన్టీఆర్ తన మిత్రుడైన కొరటాల గురించి చెప్పాడు.
Tags:    

Similar News