తారక్ స్టెప్పులు దించేసిన జపనీ ఫ్యాన్
ప్రతిభకు ఎల్లలు లేవు. డిజిటల్ యుగంలో అసలు సరిహద్దులే లేవు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రతిభ ఉన్నా.. మారుమూల ప్రాంతాలకు సైతం అది వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ జపనీ ఫ్యాన్స్ డ్యాన్సింగ్ వీడియో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ .. ఎన్టీఆర్ లాంటి స్టార్లకు జపాన్ లో వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాలతో పాటు అక్కడ ఎన్టీఆర్ సినిమాల్ని చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. జపాన్ లో తారక్ ఫాలోయింగ్ ఏపాటిదో తెలియజేసే పలు వీడియోలు ఇంతకుముందు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో ట్విట్టర్ లో కి వచ్చింది.
ఈ వీడియోలో ఎన్టీఆర్ జపనీ అభిమాని సేమ్ టు సేమ్ ఎనర్జీతో స్టెప్పులు దించేస్తూ తారక్ పాటకు నర్తించారు. ఎన్టీఆర్ - సమీరా రెడ్డి జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అశోక్ (2006) సినిమాలోని గోల గోల పాటను ఎంపిక చేసుకుని .. యథాతథంగా స్టెప్స్ దించేసిన సదరు జపనీ జంటను చూడగానే ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. ఇంచుమించు తారక్ - సమీరా లానే కాస్ట్యూమ్స్ మేకప్ సహా ప్రతిదీ ప్రిపేర్ చేసుకుని స్టెప్పుల్ని యథాతథంగా దించేశారు. ఆ వీడియోని జపనీ జంట సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ గా మారింది. ఈ వీడియో వీక్షించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

インド映画のダンス家で再現してみた@sasakiasahi https://t.co/Im0RCLLBJQ#bollywood #インドダンス pic.twitter.com/2i3Qzu7Myq
— HIROMUNIERU (@HIROMUNIERU1) July 3, 2020