• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవ‌ర‌కొండ‌పై తార‌క్...

దేవ‌ర‌కొండ‌పై తార‌క్ ఫ్యాన్స్ వీరంగం

By - Tupaki Desk
Update: 2018-09-22 04:28 GMT
సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఫ్యాన్స్ వీరంగం గురించి తెలిసిందే. అభిమానులు తాము ఏం చెప్ప‌ద‌లుచుకున్నా ట్విట్ట‌ర్‌ - ఎఫ్‌ బి - ఇన్‌ స్టా వంటి సామాజిక మాధ్య‌మాల్లో చెప్పేస్తున్నారు. వీటిలో డిబేట్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు తార‌క్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇవ్వ‌డం ఫిలింన‌గ‌ర్‌ లో చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఒక హీరో అభిమానులు - వేరొక హీరోకి వార్నింగ్ ఇవ్వ‌డం - ఇత‌ర హీరోల అభిమానుల‌తో గొడ‌వ‌లు ప‌డ‌డం అన్న‌ది అనాదిగా ఉన్న‌దే. కానీ ఇలా సామాజిక మాధ్య‌మాల్లో వీరంగం వేయ‌డం అన్న‌ది లేటెస్ట్ ట్రెండ్. అయితే తార‌క్ ఫ్యాన్స్ దేవ‌ర‌కొండ‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే .. అత‌డు న‌టించిన `నోటా` చిత్రాన్ని `అరవింద స‌మేత‌`కు పోటీగా రిలీజ్ చేయ‌కూడ‌ద‌నేది ఫ్యాన్స్ ఉద్ధేశం. అలా రిలీజ్ చేస్తే `నోటా` బాక్సాఫీస్ వార్‌ లో ఐపు లేకుండా పోతుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ సునామీ ముందు ఇంకేదీ నిల‌వ‌ద‌ని అభిమానం చాటుకున్నారు. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ త‌న సినిమా నోటా రిలీజ్‌ కి ఆన్‌ లైన్ పోల్ నిర్వ‌హిస్తూ పెద్ద షాకిచ్చాడు. నోటా రిలీజ్‌ కి మూడు తేదీల్లో ఏదో ఒక‌టి మీరే డిసైడ్ చేయండి అంటూ అక్టోబ‌ర్ 5 లేదా 10 లేదా 18 అంటూ తేదీల్ని ప్ర‌క‌టించాడు. వీటిలో ఏదో ఒక తేదీని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాల్సిందిగా కోరాడు.

ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత` అక్టోబ‌ర్ 10న రిలీజ‌వుతోంది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 18న రామ్‌- `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` - విశాల్‌- `పందెంకోడి- 2` చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఇవ‌న్నీ `నోటా`కి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇచ్చేవే. `గీత గోవిందం` లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌ర్వాత దేవ‌ర‌కొండ‌ `నోటా`పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమా ట్రైల‌ర్‌ కి చ‌క్క‌ని స్పంద‌న ద‌క్కింది. అయితే `అర‌వింద స‌మేత` క్రేజ్ పీక్స్‌ లో ఉంది. అలానే రామ్‌ - విశాల్ సినిమాల‌కు క్రేజు త‌క్కువేం లేదు. అందుకే `నోటా` ఆ సినిమాల కంటే ముందే అక్టోబ‌ర్ 5న రిలీజైపోతే మంచిద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అదే తేదీకి నారా రోహిత్ `వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు` చిత్రం రిలీజ‌వుతోంది.
   

Tags:    
  • NTR Fans 
  • Vijay Devarakonda 
  • Nota Release 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS