అప్పుడు జై లవ కుశ బాగుండేది

Update: 2017-09-04 04:05 GMT
అసలు ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు అని ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ ను ఎవ్వరూ అడగరు. కాని ఎన్టీఆర్ మాత్రం 'జై లవ కుశ' కథకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని చెప్పేశాడు. అదే సమయంలో ఈ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నట్లే.. తాము కూడా ముగ్గురమని.. ఒకరు మిస్సవ్వడంతో బాధగా ఉందని చెప్పాడు. ఆడియో రిలీజ్ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వింటే హార్ట్ టచ్చింగా ఉన్నాయ్.

‘‘హిట్టు ఫ్లాపుల సంగతి పక్కన పెడితే అన్నదమ్ములుగా మా నాన్నముందు గర్వంగా నిలిచే చిత్రమవుతుంది. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ కాదు. మా అన్న. నాన్న తర్వాత ఇంకో నాన్న. అతడితో కలిసి పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఎప్పటికి మరిచిపోలేనిది. మా అందరికీ దూరమైన మా సోదరుడు జానకిరామ్ ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే జై లవకుశ అనే టైటిల్ సార్ధకమై ఉండేది. ముందుముందు ఈ సినిమా గురించి మీ అందరితో చాలాసార్లు కలుస్తా. అప్పుడు అందరం మరిన్ని విశేషాలు మాట్లాడదాం’' అంటూ ఎన్టీఆర్ తన సభకు హాజరైన వారందరినీ తన మాటలతో మెప్పించాడు.

''నందమూరి ప్రొడక్షన్ హౌస్ లో నందమూరి హీరో నటించి పదిహేనేళ్లయింది. మళ్లీ ఆ విధంగా సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా గురించి నేను పదో తేదీన ఫ్యాన్స్ సభలో మాట్లాడతాను'' అని నిర్మాత కళ్యాణ్ రామ్ చెప్పాడు. జై లవకుశ సినిమా చూస్తుంటే లెజెండ్ ఎన్.టి.రామారావు నటించిన లవకుశ గుర్తుకొస్తోంది. చరిత్రలో నిలిచిపోయిన సినిమా అది. ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ప్రజాభిమానం చూరగొనాలని కోరుకుంటున్నా. ఆ పని చేయాల్సింది ప్రజలు.. నందమూరి వీరాభిమానులే అని హరికృష్ణ ఆకాంక్షించారు.
Tags:    

Similar News