హీరో పాత్రను దర్శకుడు తీర్చిదిద్దే విధానంలోనే ఉంటుంది సక్సెస్. ఆ కోవలో చూస్తే ఇటీవలి కాలంలో అమరేంద్ర బాహుబలి తర్వాత అంతే ఇదిగా కేజీఎఫ్ రాఖీభాయ్ గురించిన ముచ్చట సాగింది. అన్ని భాషల్లోనూ రాఖీ భాయ్ ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అంతగా ప్రభావవంతమైన పాత్రను తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుంది. కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథను ఎంచుకుని.. అక్కడ ఒకరిని మించిన డాన్ ఒకరు అంటూ ఎస్టాబ్లిష్ చేస్తూ... ఎందరు డాన్ లు ఉన్నా రాఖీ భాయ్ ని ఎదురేలేనివాడిగా అతడు ఊహించిన తీరు మహదాద్భుతం. కరుడుగట్టిన నేరగాళ్ల సామ్రాజ్యంలో అంత రఫ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి మెప్పించిన తీరు అసమానం. హీరోయిజాన్ని మరో లెవల్లో చూపించాడు.
అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 లో రాఖీ భాయ్ వర్సెస్ అధీరా పరాకాష్టలో ఉంటుందని రివీలైంది. ఆ తర్వాత తెరకెక్కించబోయే సినిమాపైనా.. అందులో నటించనున్న హీరోపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని లాక్ చేశారు. అతడు ఇప్పటికే పలుమార్లు తారక్ తో స్క్రిప్టును డిస్కస్ చేశారు. అందులో ఎన్టీఆర్ పాత్రను అతడు ఎంతో యూనిక్ గా తీర్చిదిద్దుతున్నాడన్న గుసగుస వినిపించింది.
తాజాగా తారక్ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపై మరో ఆసక్తికర విషయం లీకైంది. తారక్ పాత్ర తీరుతెన్నులు కేజీఎఫ్ రాఖీ భాయ్ ని మించేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నారట. ఇక ఇందులో ఎన్టీఆర్ మరో లెవల్లో కనిపిస్తారని చెబుతున్నారు. యంగ్ యమ తన కెరీర్ లో ఎన్నో విలక్షణ మైన పాత్రల్లో నటించారు. కానీ తన కెరీర్ బెస్ట్ రోల్ ని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నారన్న వార్త అభిమానుల్లో వేడెక్కిస్తోంది. తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తన కెరీర్ బెస్ట్ అని భావిస్తుంటే .. అంతకు మించి చూపించేందుకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ సినిమా లోనూ మరో విలక్షణమైన పాత్ర లోనే ఎన్టీఆర్ కనిపిస్తారన్న సమాచారం ఉంది.