జూనియర్ తో సైలెంట్ అంటున్నాడా?
త్వరలో ప్రారంభం కానున్న టాలీవుడ్ సినిమాల్లో.. జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీని క్రేజీ ప్రాజెక్టుగా చెప్పాలి. ఈ సినిమా తను సిద్ధం చేసుకున్న స్క్రిప్టును.. మరోసారి రీరైట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ మరోసారి తన ఫిజిక్ ను తగ్గించుకునే పనిలో పడ్డాడు.
కొన్ని వారాల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పుడీ చిత్రం పై బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇదే టైటిల్ అంటూ ఓ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకు ముందు కొన్ని పేర్లు వినిపించినా.. ఇప్పుడు బైట బాగా వినిపిస్తున్న టైటిల్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. 'ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్ ను ఎన్టీఆర్- త్రివిక్రమ్ చిత్రానికి ఫైనల్ చేశారన్నది లేటెస్ట్ టాక్. టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్ కు డిఫరెంట్ టేస్ట్ ఉంది. దాని ప్రకారమే ఈ పేరు సూచించారన్నది టాక్.
అయితే.. ఆన్ సైలెంట్ మోడ్ అనేది ట్యాగ్ లైన్ మాత్రమే అనే మాట వినిపిస్తోంది. వింటుంటే ఇదే వాస్తవం అనిపిస్తోంది కూడా. ఎన్టీఆర్ పేరునే టైటిల్ గా సెట్ చేసి.. ఆ పాత్ర సైలెంట్ మోడ్ లో ఉంటుందనే అర్ధం వచ్చేలా ట్యాగ్ లైన్ తగిలించి ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి టైటిల్ నుంచే ఈ కాంబో కొత్తగా క్రియేటివిటీ చూపించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.