ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌

Update: 2020-02-11 08:45 GMT
అల వైకుంఠపురంలో చిత్రంతో తన గురించి వస్తున్న విమర్శలకు.. తనపై కొందరు చేస్తున్న ఆరోపణలకు త్రివిక్రమ్‌ సమాధానం ఇచ్చాడు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం ఎన్టీఆర్‌ తో అనే విషయం దాదాపుగా ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ మే నుండి త్రివిక్రమ్‌ కు డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ లోపు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ ను పూర్తి చేసి షూటింగ్‌ కు రెడీ అవ్వాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం స్టోరీ లైన్‌ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్‌ టచ్‌ తో ఈ చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఒక రాజకీయ నాయకుడి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడట. భరత్‌ అనే నేను.. లీడర్‌ తరహాలో అనూహ్యంగా హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడట. రాజకీయాల్లో తనదైన ముద్రను హీరో ఎలా వేశాడు అనే విషయాలను ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో దర్శకుడు త్రివిక్రమ్‌ చూపించబోతున్నట్లుగా సోషల్‌ మీడియా లో టాక్‌ నడుస్తుంది.

స్టోరీ లైన్‌ చాలా ఆసక్తికరంగా ఉండటంతో చిత్ర నందమూరి అభిమానులు అప్పుడే సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. అరవింద సమేత చిత్రం తో నిరాశ పర్చిన త్రివిక్రమ్‌ ఈసారి నందమూరి అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమాను ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్‌ నమ్మకం పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్‌ గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌ హోం బ్యానర్‌ గా చెప్పుకునే హాసిన హారిక బ్యానర్‌ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. వచ్చే సమ్మర్‌ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News