తారక్-త్రివిక్రమ్ ఆన్ డ్యూటీ

Update: 2018-03-29 08:02 GMT
ఇంకా మొదలుకాదేమి అని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ త్రివిక్రమ్ సినిమా గురించి పాడుకుంటున్నారు కాని బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఇద్దరు కలిసి వర్క్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. కాకపోతే ప్రస్తుతానికి సినిమా కోసం కాదు. ఐపిఎల్ బ్రాండ్ అంబాసడర్ గా తెలుగు రాష్ట్రాల నుంచి తారక్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రోమోలు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి. గతంలో యాడ్స్ డైరెక్ట్ చేసిన అనుభవం త్రివిక్రమ్ కు ఉంది కాబట్టి యంగ్ టైగర్ చేసే ఈ యాడ్స్ కూడా తననే టేకప్ చేయమని స్టార్ మా సంస్థ ఆఫర్ చేయటంతో పనిలో పనిగా ఇది చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీటికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతోందని సమాచారం. ఇది మరో రెండు రోజుల పాటు సాగాక ఏప్రిల్ మూడో వారం నుంచి తమ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిరవధికంగా జరపబోతున్నట్టు వినికిడి.

ఐపిఎల్ ప్రమోషన్ కోసం తారక్ త్రివిక్రమ్ టై అప్ అవ్వడంలో స్టార్ మా యాజమాన్యం తీవ్ర కృషి చేసిందని తెలిసింది. త్వరలోనే ఇవి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్నాయి. ప్రస్తుతం నగర శివార్లలో వేసిన సెట్స్ లో ఇవి షూట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. దీని వల్ల ఎన్టీఆర్ లుక్ పూర్తిగా రివీల్ అయిపోతుంది కాబట్టి సినిమాలో ఎలా ఉంటాడో అన్న సస్పెన్స్ ఇకపై ఉండదు. పైగా డైరెక్ట్ చేస్తోంది త్రివిక్రమే కాబట్టి సినిమాలోని ఒరిజినల్ గెటప్ నే దీని కోసం వాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తారక్ త్రివిక్రమ్ ఇద్దరు డ్యూటీ లో దిగిపోయారు. ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ తో పక్కా స్క్రిప్ట్ అండ్ ప్లానింగ్ తో అన్ని సిద్ధం చేసుకున్నట్టు టాక్. దసరాకు విడుదల అనుకుంటున్నారు కాని ఒకవేళ అది మిస్ అయితే దీపావళికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ ట్యూన్స్ కంపోజ్ చేయటం ఈపాటికే మొదలైపోయింది.
Tags:    

Similar News