టీజర్ టాక్: కండల వీరుడి గాత్రం

Update: 2019-03-16 10:37 GMT
మన దగ్గర హీరోలు గొంతులు సవరించుకోవడం చాలా మాములు. సరదాగా చేసినా అందులో హిట్ అయినవే ఎక్కువగా ఉంటాయి. తమిళ్ లో అయితే శింబు లాంటి వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా సంగీత దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇటీవలే తమిళ్ లో విడుదలైన 90 ఎంఎల్ కి మ్యూజిక్ ఇచ్చింది ఇతనే. చిరు నాగ్ పవన్ లాంటి వాళ్ళు హిట్ ట్రాక్స్ పాడినా ఆ రిస్క్ అంతకంటే ఎక్కువ చేయలేకపోయారు.

ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ వంతు వచ్చింది. అతని స్వంత నిర్మాణంలో రూపొందుతున్న నోట్ బుక్ సినిమా కోసం సల్లు భాయ్ సింగర్ అవతారం ఎత్తాడు. మై తేరే అంటూ సాగే స్వీట్ మెలోడీని విశాల్ మిశ్ర కంపోజ్ చేయగా నిజంగా పాడింది సల్మానేనా అనేలా స్వీట్ గా మిక్స్ చేశారు. అయితే నోట్ బుక్ లో హీరో సల్మాన్ ఖాన్ కాదు.

జహీర్ ఇక్బల్-ప్రనూతన్ బెహల్ జంటగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నోట్ బుక్ ని త్వరలో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది సల్మాన్ టీమ్. ఇందులో కండల వీరుడు చిన్న క్యామియో చేసినట్టు టాక్ ఉంది. ఇక ఈ టీజర్ గురించి ఎక్కువ చెప్పేందుకు ఏమి లేదు. కేవలం 30 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఆకట్టుకునే అంశం సల్మాన్ లుక్. 53 ఏళ్ళ వయసులో కూడా ఇంకా యువకుడిలా కనపడుతున్న ఇతని గ్లామర్ రహస్యం ఏమిటో మరి. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా నోట్ బుక్ విడుదల కాబోతోంది


Full View

Similar News