మణిశర్మ 'టకీలా' కలెక్షన్.. 'బేబీ' డైరెక్టర్ ఐడియా బాగున్నట్లు ఉందే..

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి దర్శకుడు సాయి రాజేష్ చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

Update: 2026-05-26 04:29 GMT

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి దర్శకుడు సాయి రాజేష్ చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ సినిమా సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో మాట్లాడిన సాయి రాజేష్.. మణిశర్మ ఇంట్లో చూసిన అరుదైన టకీలా కలెక్షన్ పై చేసిన కామెంట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

"మొదటిసారి మణిశర్మ గారి ఇంటికి వెళ్లా. గేటు దాటి లోపలికి వెళ్లాక బెంజ్ కారు కనిపించింది. ఇలాంటి కారు ఎప్పుడు కొనుగోలు చేస్తానా అని అనిపించింది. తర్వాత ఆయన ఆఫీస్ చూసి ఇలాంటిది ఎప్పుడు కట్టించుకుంటానా అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళాక టకీలా కలెక్షన్ చూసి షాక్ అయ్యా. ఆ కలెక్షన్‌ తో ఒక చిన్న ఇండిపెండెంట్ సినిమా తీసేయొచ్చు" అంటూ సాయి రాజేష్ నవ్వుతూ చెప్పారు..

అంతేకాదు, మణిశర్మ తనపై చేసిన ఫన్నీ కామెంట్స్ ను కూడా ఆయన ప్రస్తావించారు. 'హార్మోనియం దుమ్ముదులుపుతుంటే నేను ఛాన్స్ ఇచ్చానని ఆయన అంటున్నారు. కానీ ఆ మాటల్లో నిజం లేదు. మణిశర్మ గారు ఎప్పటికీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్' అని సాయి రాజేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఆ కామెంట్స్ వ్యాఖ్యల కంటే ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకున్న విషయం మాత్రం 'టకీలా కలెక్షన్‌ తో సినిమా తీసేయొచ్చు' అన్న కామెంట్. కొందరు ఫన్నీగా స్పందిస్తూ.. అది నిజంగా మంచి ఐడియా, మణిశర్మ కలెక్షన్‌ కు కూడా ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండొచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా సాయి రాజేష్ ఐడియా బాగుందని అంతా కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, చెన్నై లవ్ స్టోరీపై కూడా ఆసక్తి పెరుగుతోంది. కల్ట్ హిట్ మూవీ బేబీ తర్వాత సాయి రాజేష్ కథ అందిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఆ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రవి నంబూరికి తన సినిమాతో అవకాశం కల్పించడం విశేషం.

మూవీలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండగా, మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌ గా కనిపించనున్నారు. లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ డ్రామాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో మొత్తం ఏడు మెలోడీ పాటలు ఉండబోతున్నాయని సాయి రాజేష్ వెల్లడించడం మ్యూజిక్ లవర్స్ లో ఆసక్తి పెంచింది.

'ఇటీవలి కాలంలో పూర్తి స్థాయి మెలోడీ ఆల్బమ్‌లు తగ్గిపోయాయి. అందుకే ప్రత్యేకంగా మణిశర్మ గారిని రిక్వెస్ట్ చేసి సినిమాకు అన్ని మెలోడీ పాటలు కావాలని అడి' అని సాయి రాజేష్ చెప్పారు. దీంతో చాలా కాలం తర్వాత మణిశర్మ నుంచి క్లాసిక్ మెలోడీ ఆల్బమ్ వినిపించబోతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. బేబీతో యూత్ ఎమోషన్స్ ను చూపించి భారీ విజయాన్ని అందుకున్న సాయి రాజేష్.. ఇప్పుడు నిర్మాతగా, కథా రచయితగా చెన్నై లవ్ స్టోరీతో రానున్నారు. ఇక మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News