కొత్త సినిమాలకు గాలం వేస్తున్న తెలుగు ఓటీటీ యాప్!!
సినిమా రంగం దాదాపుగా కుదేలైంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. అయితే అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఒకే రకమైన డిమాండ్ ఉంటుందని.. భారీ సబ్ స్క్రైబర్ల సంఖ్యతో.. అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ తో ట్రేడ్ లో దూసుకుపోతున్నారు అని అనుకోవడం ఆశ్చర్యం ఏమీ కాదు. అయితే అందులో నిజం మాత్రం లేదు. పోటీలో ఎన్నో ఏళ్లుగా పాతుకు పోయిన ప్రపంచ స్థాయి ఓటీటీలకు తప్ప దేశీయంగా ఉన్న ఓటీటీలకు భారీ ఆదరణ ఏమీ దక్కడం లేదు. ఇదే సమయంలో తెలుగువారు ప్రారంభించిన ఒక ఓటీటీ యాప్ ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఏం చేయాలా అని వారు తలలు పట్టుకుంటున్నారు.
నిజానికి దేశీయంగా ఉన్న రెండు మూడు భారీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు గ్లోబల్ ప్లేయర్ ల పోటీ తట్టుకోలేక వాటితోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటేమో ఆ గ్లోబల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలను తన ఫ్లాట్ ఫాం లో కూడా అందుబాటులో ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంది. మరో దేశీయ ఓటీటీ అయితే ఏకంగా అమెరికన్ సంస్థతో కలిసిపోయింది. పరిస్థితులు ఇలా ఉండడంతో మన తెలుగు ఓటీటీ అధినేతలు పాపులారిటీ పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో నాలుగు బోల్డ్ కంటెంట్ ఉండే వెబ్ సిరీస్ లతో నెట్టుకొద్దామంటే కుదిరే పని కాదు. ఇలాంటి వాటి కోసం పెద్దగా సబ్ స్కైబర్లు పెరగరు. పెద్ద హీరోల సినిమాలు.. కొత్త సినిమాలు అందుబాటులోకి తీసుకు వస్తేనే సబ్ స్కైబర్ల సంఖ్య పెరుగుతుంది.
అందుకే ఈ దిశగా తెలుగు ఓటీటీ యాప్ అధినేత కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం కొందరు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే కొన్ని సినిమాలను డైరెక్ట్ గా తమ ఓటీటి ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. అంతా బాగుంది కానీ నీ పోటీలోకి ఆ గ్లోబల్ ప్లేయర్లు కూడా దిగితే.. భారీ రేట్లు ముట్టజెప్పి సినిమా రైట్లు కొనగలరా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ తెలుగు ఓటీటీ యాప్ లో కనీసం నాలుగైదు క్రేజీ సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అయితే గాని సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగేలా లేదని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.