• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ప్రియా వారియర్' తో వార్...

'ప్రియా వారియర్' తో వార్ ఎందుకో?

By - Tupaki Desk
Update: 2019-02-21 11:56 GMT
ప్రియా వారియర్...ఒకే ఒక్క సారి కన్ను గీటి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది ఈ భామ. అయితే మలయాళంలో "ఒరు ఆడార్ లవ్"తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని "లవర్స్ డే"కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే సినిమా భారీ డిసాస్టర్ గా నిలవడమే కాకుండా - మరో పక్క ఈ సినిమా వల్ల ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ మధ్య భారీ గొడవకు దారి తీసింది. ఇదిలా ఉంటే అసలు ఇంతకీ ఈ గొడవ ఏంటి? ఏం జరిగింది అని వివరాల్లోకి వెళితే...

ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నూరిన్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ లో ఒకరు అని చెప్పవచ్చు. సినిమా పరంగా - పాత్రల పరంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రియా హీరోయిన్  అయినప్పటికీ - నూరిన్ పాత్ర మాత్రం మంచి మార్కులు వేసుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా నటన పరంగా ప్రియ కన్నా నూరిన్ బాగా చేసింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో జరిగిన అన్యాయాన్ని నూరిన్ వివరిస్తూ...ఈ సినిమా విషయంలో నన్ను మోసం చేశారు అని - అసలు ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ నేనే అని - కానీ, ప్రియ రాత్రికి రాత్రే ఫేమస్ కావడంతో పాత్రలు పూర్తిగా మార్చేసారు అని, అంతేకాకుండా తన పాత్రను సపోర్టింగ్ పాత్రగా చేసేసారు అని - ఇది చాలా అన్యాయం అని - ఆమె చెబుతుంది.

అంతేకాకుండా ఇదంతా ప్రియా వారియర్ వల్లనే జరిగింది అని - అందుకే భవిష్యత్తులో ఆమెతో నటించను అని - సమస్యే లేదు అని - అయితే హీరో రోషన్ అబ్దుల్‌ తో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అని తెలిపింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా వల్ల ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య పెద్ద గొడవే వచ్చింది. ఏది ఏమైనా...క్రేజ్ అయితే ప్రియకి వచ్చింది కానీ - సినిమా పరంగా యాక్టింగ్ పరంగా మాత్రం నూరిన్ బాగా చేసింది అని విమర్శకులు సైతం ప్రసంచించడం గమనార్హం.
Tags:    
  • Noorin Shereef 
  • Priya Prakash Varrier 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS