• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోపై నాన్ బెయిలబుల్...

హీరోపై నాన్ బెయిలబుల్ వారంట్.. పరారీ

By - Tupaki Desk
Update: 2017-10-07 08:30 GMT

ఒక హీరోపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ కావడం అంటే చిన్న విషయమేమీ కాదు. కానీ చిన్న విషయాన్నే హీరోలు ఒక్కోసారి పెద్దది చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్.. కోర్టుకు హాజరు కావడం చిన్న విషయంగా ఆయా హీరోలు భావించకపోవచ్చు. ఇప్పుడు తమిళ హీరో జై పరిస్థితి ఇలాగే ఉంది.

జర్నీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై. ఆ తర్వాత ఇతడి సినిమాలకు ఇక్కడ పెద్దగా ఆదరణ దక్కకపోయినా.. తెలుగమ్మాయి అంజలి లవర్ గా జై కు ఇక్కడ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. రీసెంట్ గా ఇతడు ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు. ఫుల్లుగా తాగేసి డ్రైవ్ చేస్తూ.. చెన్నైలో ఓ డివైడర్ ను ఢీ కొట్టడంతో.. ఇతడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టుకు లాగారు. బుధవారం నాడు కోర్టు హియరింగ్ ఉండగా.. ఆ రోజున కోర్టుకు వచ్చాడు జై. కానీ గురువారం కూడా రావాలని జడ్జ్ ఆదేశించగా.. ఆ ఆదేశాలను జై పట్టించుకోలేదు. దీంతో అతడిని తీసుకువచ్చి హాజరు పరచాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది.

కానీ జై అందుబాటులో లేడని పోలీసులు కోర్టుకు తెలపడంతో.. మెట్రోపాలిటన్ కోర్టు జై పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేసింది. దీంతో జై కు పరారీ కాక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ఈ వారంట్ ను కోర్ట్ రీకాల్ చేసేవరకూ అమలులో ఉండనుండగా.. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కోవడం.. జైకు గత మూడేళ్లలో ఇది రెండోసారి. ఇతడి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు  చేయాల్సిందిగా కూడా చెన్నై పోలీసులు కోర్టుకు విన్నవించారు.



Tags:    
  • Non-bailable warrant 
  • Actor Jai 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS