మహేష్ - పవన్ ల మధ్య సంక్రాంతి ఫైట్ లేనట్లేనా..?
కరోనా మహమ్మారి కారణంగా 2021 సంక్రాంతి వార్ లో స్టార్ హీరోల సినిమాలు లేకుండా పోయాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ లోటు తీర్చడానికి పెద్ద హీరోల అప్పుడే సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. మహేష్ - డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట'.. పవన్ - క్రిష్ కలిసి చేస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రాలను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ - మహేష్ మధ్య బాక్సాఫీస్ వార్ ఉండకపోవచ్చని అంటున్నారు.
'సర్కారు వారి పాట' అనుకున్న తేదీకి వచ్చే అవకాశాలున్నాయి కానీ.. 'వీరమల్లు' సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అనే టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే దుబాయ్ లో భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ సినిమా.. గ్రాఫిక్స్ వర్క్ అవసరం లేదు కాబట్టి మెల్లగా షూట్ చేసినా పెద్ద పండక్కి రెడీ అవుతుంది. కానీ 'వీరమల్లు సినిమా భారీ సెట్స్ లో షూట్ చేయాల్సి ఉంది. అందులోనూ ఎక్కువ వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి కేవలం 45 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తయింది. ఒకవేళ షూటింగ్ అప్పటికి పూర్తయినా సీజీ పనులకు చాలా సమయం కావాలి. దీనికి తోడు పవన్ రెండు సినిమాలు ప్యారలల్ గా షూట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ చూసుకుంటే 'వీరమల్లు' కాస్త లేట్ అయ్యే అవకాశం ఉన్నాయి.
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అన్ని పనులు ఆగిపోయాయనని.. షూటింగ్ కంప్లీట్ అవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉందని నిర్మాతే చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ - పవన్ ల మధ్య సంక్రాంతి వార్ ఉండకపోవచ్చని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు నాలుగు సార్లు కొన్ని రోజుల గ్యాప్ తో సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ.. ఇంత వరకు డైరెక్ట్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడలేదు. 'సర్కారు వారి పాట' 'హరి హర వీరమల్లు' తో ఇద్దరూ పోటీ పడతారు అనుకున్నారు కానీ.. సిచ్యుయేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ ఫైట్ ఉండకపోవచ్చని అంటున్నారు.