'ధురంధర్' ఎఫెక్ట్: రేర్ ఫీట్ సాధించిన ఫస్ట్ హీరోయిన్!
'ధురంధర్'.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పేరిది. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా 'యూరి:ది సర్జికల్ స్ట్రైక్స్' ఫేమ్ ఆదిత్యధర్ నిర్మిస్తూ రూపొందించారు.;
'ధురంధర్'.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పేరిది. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా 'యూరి:ది సర్జికల్ స్ట్రైక్స్' ఫేమ్ ఆదిత్యధర్ నిర్మిస్తూ రూపొందించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఓ మోస్తారు అంచనాలతో డే వన్ నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం మొదలు పెట్టింది. పాకిస్థాన్ తీవ్రవాదాన్ని, అది ఇండియాపై చేసే కుట్రలని ఎత్తిచూపుతూ రియలిస్టిక్ వేలో రూపొందించడంతో ఈ సినిమాపై అరబ్ కంట్రీస్ అయిన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈ నిషేధం విధించాయి.
అయితే భారత్‌తో సహా యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తోంది. సినిమాలోని కీలక ఘట్టాల్లో దుబాయ్‌తో పాటు గల్ఫ్ దేశాల ప్రస్థావన ఉండటం వల్లే అవి 'ధురంధర్'ని తమ దేశాల్లో రిలీజ్ కాకుండా నిషేధించాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదే విషయాన్ని ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెబుతున్నారు.
అరబ్ కంట్రీస్‌లలో నిషేధం విధించి అక్కడి ఆదాయానికి గండికొట్టినా కానీ 'ధురంధర్' వరల్డ్ వైడ్‌గా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటూ సంచలన విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లని సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఇందులో నటించిన నటీనటులకు ఊహించని పాపులారిటీని తెచ్చి పెట్టింటి. ఇదిలా ఉంటే ఇందులో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించిన సారా అర్జున్ ఈ మూవీతో రేర్ ఫీట్‌ని సాధిచి వార్తల్లో నిలుస్తోంది.
సారా అర్జున్ ఆరేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చియాన్ విక్రమ్ నటించిన 'దైవతిరుమగల్' తో పరిచయమైంది. ఇదే మూవీని తెలుగులో 'నాన్న' పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తొలి సినిమాతో అవార్డుల్ని సొంతం చేసుకున్న సారా ఏకంగా 17సినిమాల వరకు చేసింది. మణిరత్నం ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్' యంగ్ నందినిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. గుణశేఖర్ రూపొందిస్తున్న 'యుఫోరియా' తో 2026లో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
సారా అర్జున్ తండ్రి కూడా నటుడే కావడం విశేషం. పేరు రాజ్ అర్జున్. హిందీతో పాటు తెలుగులో 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలోనూ రాజ్ అర్జున్ నటించారు. ఆయన నట వారసురాలిగా సినిమాల్లోకి ఆరేళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చిన సారా అర్జున్ 20 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా 'ధరుంధర్'లో నటించింది. తను హీరోయిన్‌గా నటించి తొలి మూవీ ఇది. ఈ సినిమాతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులోనే హీరోయిన్‌గా రూ.1000 కోట్ల బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని రేర్ ఫీట్‌ని సాధించింది. మిగతా హీరోయిన్‌లు 30 ఏళ్ల వయసులో ఈ ఫీట్‌ని సొంతం చేసుకుంటూ సారా మాత్రం కేవలం 20 ఏళ్ల వయసులో..అది కూడా ఫస్ట్ మూవీతో సాధించడం రికార్డ్‌గా చెబుతున్నారు.