3డి గణపయ్యను కనలేమా దేవా?
విఘ్న వినాయకుని సందర్శించి పూజలు పునస్కారాలు చేసుకుని - తలపై అక్షింతలు వేసుకున్న తర్వాతనే బయట ఏ వ్యాపకమైనా! దాంతో పాటే ఈటీవీలో వచ్చే వినాయక చవితి సినిమానో వరసిద్ధి వినాయక విజయం చిత్రాన్నో వీక్షించేందుకు సిద్ధమయ్యే వాళ్లు ఉంటారు. భక్తులకు కొంగు బంగారం ఇచ్చే దేవుడు. నీలాపనిందలు తొలగించే దేవుడు కాబట్టి ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిళ్ల నడుమ ఉపశమనం పొందడం కోసమైనా ఆ సినిమాలు తప్పక వీక్షించాలి.
వినాయక చవితికి తెలుగు లోగిళ్లలో ఉండే ప్రాధాన్యత గురించి ఎంతో ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా ఓ మాట గుర్తు చేసుకోవాలి. అసలు వినాయక చవితిపై తీసిన సినిమా ఏదైనా ఉందా? అంటే నాటి మేటి క్లాసిక్ సినిమా ఒకటుంది. వినాయక చవితి టైటిల్ తోనే 1957 లో ఈ తెలుగు సినిమా రిలీజైంది. ఎన్టీఆర్ - జమున - కృష్ణ కుమారి నాయకానాయికలుగా సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన ఈ సినిమా ల్యాండ్ మార్క్ సినిమాగా చరిత్రలో నిలిచింది. గుమ్మడి వెంకటేశ్వరరావు - ఆర్.నాగేశ్వరరావు - రాజనాల - ఏ.ప్రకాశరావు - బాలకృష్ణ ఈ చిత్రంలో నటించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరాల్ని సమకూర్చారు. సముద్రాల రాఘవాచార్య పాటలు - మాటలు రాశారు. అశ్వరాజ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎన్.టి.రామారావు కృష్ణునిగా నటించారు ఈ చిత్రంలో. సముద్రాల దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు బబ్రువాహన, భక్త రఘునాధ - వినాయక చవితి. వీటిలో వినాయక చవితి మాత్రమే ప్రేక్షకాదరణ పొందింది. సత్రాజిత్తు (గుమ్మడి) పై చిత్రీకరించిన దినకరా శుభకరా పాట చిత్రానికి తలమానికం. శ్రీకృష్ణుడు జాంబవంతునితో గదా యుద్ధం చేయటం ఈ చిత్రంలో ఆసక్తికరం. జయగణ నాయక వినాయక జయగణ నాయక..., దినకరా శుభకరా... పాటలు ఇప్పటికీ పల్లెల్లో పండగల వేళ తప్పనిసరిగా మార్మోగుతూనే ఉంటాయి. అంతగా ఆ పాటలు రిజిస్టర్ అయ్యాయంటే అదంతా ఘంటసాల స్వరం గొప్పతనం అనే చెప్పాలి. ఇకపోతే మోడ్రన్ యుగంలో టెక్నలాజికల్ గ్లింప్స్ తో బోలెడన్ని సినిమాలొస్తున్నాయి.
బయోపిక్ లు - ఫిక్షన్ - సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీస్తున్నారు. కానీ దేవుళ్ల సినిమాల్ని మరిచారు. అందునా బొజ్జ గణపయ్యపై సినిమాలే లేవు. కనీసం గణపతి దేవుని 3డిలో చూపించే ప్రయత్నం చేసినా మన పురాణేతిహాస కథల్ని గుర్తు చేసిట్టుంటుందేమో! వినాయకుడు నచ్చని చిన్నారి కానీ - పెద్దలు కానీ ఉన్నారా? ఆ కోణంలో మన దర్శకనిర్మాతలు ఆలోచించాలని కోరుకుందాం.