• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాయలవారి రాక ఉందా లేదా?

రాయలవారి రాక ఉందా లేదా?

By - Tupaki Desk
Update: 2018-10-23 11:30 GMT
ఒక హీరో కొత్త సినిమా వస్తోంది అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి ఉంటుంది. అలాంటిది ముగ్గురేసి ఉన్నారు అంటే ఎలా ఉండాలి. అబ్బే అలాంటిది మాకేమి పట్టదు అన్నట్టు ఉంది వీర భోగ వసంత రాయలు వ్యవహారం. ఈ శుక్రవారమే విడుదల ఉన్నప్పటికీ ఏదో ఒకటి రెండు పోస్టర్లను అటు ఇటు తిప్పి హడావిడి చేయడం తప్ప ఇంకే అలికిడి లేదు. ఇవాళ యుఎస్ ప్రీమియర్స్ అన్నారు. అప్ డేట్ సకాలానికి అందడం లేదు. 26న ఇక్కడ రిలీజ్ అన్నారు.

ఇప్పటిదాకా హైదరాబాద్ మాత్రమే కాదు ఏ సెంటర్ లోనూ ఆన్ లైన్ అడ్వాన్సు బుకింగ్ ప్రారంభం కాలేదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో జంట నగరాల బుకింగ్స్ ముందు వారం శనివారం నుంచే అందుబాటులో ఉంచుతున్నారు. కాని వీరభోగవసంతరాయలు మాత్రం ఇంకా టికెట్ల అమ్మకం మొదలుపెట్టలేదు. బిజినెస్ విషయంగా ఏమన్నా తేడాలు వచ్చాయా లేక ఆఖరి నిముషం దాకా సెటిల్ మెంట్లు చేసి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా చూడాలి. డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు కాబట్టి మార్పు ఉండకపోవచ్చు కానీ ఇంత సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అన్నదే అందరికీ ఉన్న అనుమానం.  

నారా రోహిత్ సుదీర్ బాబుతో పాటు చాలా కీలకమైన పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్న ఈ మూవీలో శ్రేయ కూడా ఉంది. అయినా ప్రమోషన్ ఈవెంట్ కాని పబ్లిసిటీ కాని పెద్దగా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా అఫ్రికన్ అటవీ సంతతికి చెందిన గెటప్ లో శ్రీవిష్ణుని రివీల్ చేసిన లుక్ కాస్త తేడాగా ఉంది. ట్రైలర్ కూడా కొంత అయోమయానికి గురి చేసింది. మొత్తానికి ఇంత నిస్సారంగా ఇంత కన్ఫ్యూజన్ తో జనం ముందుకు వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఇదేనేమో అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తోడు ముగ్గురు హీరోల్లో ఎవరికి మొదటి రోజు క్రౌడ్ పుల్ చేసేంత కెపాసిటీ లేకపోవడం కూడా మైనస్ గా నిలుస్తోంది.

 అయినా సినిమా తీయడం ఒక ఎత్తు దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం అన్నింటి కన్నా పెద్ద ఎత్తుగా మారిన ట్రెండ్ లో ఈ వీరభోగవసంతరాయలు ఇంత చప్పుడు లేకుండా రావడం మాత్రం ఇప్పటికే ఉన్న అనుమానాలను బలపరుస్తోంది. కంటెంట్ ఉంటె ఏ సమస్యా లేదు. లేదంటేనే అసలు సమస్య వసూళ్ళ దగ్గరే మొదలవుతుంది
Tags:    
  • Nara Rohith 
  • Veerabhoga Vasantha Rayalu Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS