పాపం 'కీ' ఎవరూ పట్టించుకోలేదు
మహర్షి దెబ్బకు ఎవరు పోటీలో ఉంటారు అనుకున్నాం కానీ ఒక రోజు ఆలస్యంగా సైలెంట్ గా మరో సినిమా విడుదలైంది. అదే కీ. రంగం లాంటి బ్లాక్ బస్టర్ తో మనదగ్గరా అంతో ఇంతో గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా నటించిన ఈ మూవీ తమిళ్ లో పాటు సమాంతరంగా తెలుగులోనూ రిలీజ్ చేశారు. చాలా పరిమితంగా థియేటర్లు దొరికాయి. సరే ఏదో దొరికిందే మహాభాగ్యం అనుకుని వదిలారు.
విచిత్రంగా ఇది వచ్చిన సంగతి రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటు ఉన్న మూవీ లవర్స్ కు సైతం తెలియకపోవడం చూస్తే పబ్లిసిటీ ఎంత దారుణంగా చేశారో అర్థమవుతుంది. కలీస్ దర్శకత్వం వహించిన కీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. నిర్మాణం కూడా భారీగానే చేశారు. సరే మహర్షి ప్రభంజనంలో ఇలా జరిగిందే అనుకుందాం. కానీ కంటెంట్ కూడా మెప్పించేలా లేకపోవడంతో కీకి కనీస ఆదరణ కరువైంది.
సైబర్ క్రైమ్ ని ఆధారంగా చేసుకుని హ్యాకింగ్ కాన్సెప్ట్ తో విశాల్ అభిమన్యుడు తరహాలో చేసిన ప్రయత్నం బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్ల నెగటివ్ టాక్ తెచ్చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్-సుహాసిని లాంటి పేరుమోసిన తెలుగు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా ఎవరిని దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఫలితం కీ సరిగా తిరగకుండానే విరిగిపోయింది. ఈ రోజు నుంచి అధిక శాతం స్క్రీన్లలో ఇది ఉండటం కూడా అనుమానంగానే ఉంది. నిక్కీ గల్రాని-అనైకా సోతి హీరోయిన్లుగా నటించిన కీ ఫైనల్ గా జీవాకు మరో చేదు అనుభవంగా మిగిలిపోయింది