ఆడియన్స్ ఇలా.. డైరెక్టర్స్ మాత్రం అలా..
కోలీవుడ్ సినీ ప్రియులు ఆస్వాదిస్తుంటే.. అక్కడి దర్శకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.;
కోలీవుడ్ సినీ ప్రియులు ఆస్వాదిస్తుంటే.. అక్కడి దర్శకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ 2 భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి మంది రెస్పాన్స్ అందుకుంటుండగా.. కొంతమంది తమిళ సినీ దర్శకులు మాత్రం ఆ విజయంపై విమర్శలు గుప్పిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. "ప్రచారం (ప్రొపగాండా)కి ప్రజల జ్ఞాపకాలు ప్రభావితం చేసే పవర్ ఉంది. జ్ఞాపకం ఎంత స్టేబుల్ గా ఉండదో మనకు తెలుసు. డీమోనిటైజేషన్ సమయంలో ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ద్వారా ఆయన ధురంధర్ 2 సినిమాపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అంతా భావిస్తున్నారు.
వెట్రిమారన్ మాత్రమే కాకుండా, మరికొంతమంది తమిళ దర్శకులు కూడా ధురంధర్ సీక్వెల్ విజయంపై నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ విమర్శలపై మరికొందరి నుంచి కౌంటర్ వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లు రెస్పాండ్ అవుతూ.. వెట్రిమారన్, పా.రంజిత్ వంటి దర్శకుల సినిమాల్లో కూడా ఒక విధమైన ప్రచార ధోరణి కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా హిందూ సంప్రదాయాలను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం జరిగిందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 చుట్టూ ప్రొపగాండా వర్సెస్ ఎంటర్టైన్మెంట్ అనే చర్చ మరింత వేడెక్కుతోంది. ఒకవైపు దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రేక్షకులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక థియేటర్లలో పరిస్థితి చూస్తే.. ఆదివారం సాయంత్రం షోల సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ప్రేక్షకులు సినిమా సన్నివేశాలకు చప్పట్లు కొడుతూ, అరుస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే.. సినిమా మీద దర్శకుల విమర్శలు ఒక వైపు, ప్రేక్షకుల ఆదరణ మరో వైపు అనే పరిస్థితి ఏర్పడింది. ఇది గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో కనిపించిన ట్రెండ్ నే గుర్తు చేస్తోంది. విమర్శలు వచ్చినా, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. మొత్తానికి ధురంధర్ 2 విషయంలో తమిళ సినీ పరిశ్రమలో అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రేక్షకులదే అనే విషయం మరోసారి రుజువవుతోంది. దర్శకులు, విమర్శకులు ఏం చెప్పినా.. థియేటర్ కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుడు ఎలాంటి అనుభూతి పొందుతున్నాడనేదే అసలు ఫలితాన్ని నిర్ణయిస్తోంది.