వారణాసి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `వారణాసి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `వారణాసి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్ కో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన సమయానికే రిలీజ్ చేయాలని కట్టుబడి టీమ్ పని చేస్తోంది. ఈనేపథ్యంలో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మహేష్ తన పార్ట్ షూటింగ్ ను సెప్టెంబర్ లేదా? అక్టోబర్ కల్లా పూర్తి చేస్తారని తెలిసింది. అనంతరం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారుట.
సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు. కానీ `వారణాసి` విషయంలో మాత్రం జక్కన్న పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు మహేష్ పై సన్నివేశౄలు చిత్రీకరిస్తుండగా మరోవైపు ఇతర పాత్రలకు సంబంధించిన షూటింగ్ కూడా ఏక కాలంలో జరుగుతోంది. కీలక షూట్ లో రాజమౌళి ఉండగా , మిగతా పార్ట్ కు సంబంధించిన షూట్ లో ఆయన టీమ్ పని చేస్తోంది. హీరోపై సన్ని వేశాల చిత్రీకరణ పూర్తయిందంటే మెజార్టీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.
అప్పటి నుంచి షూటింగ్ పరంగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని తగ్గుతుంది. సెట్ లో రాజమౌళి ఉన్నా? లేకపోయినా ఆయన టీమ్ మిగతా పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తుంది. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక విభాగాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే `వారణాసి` విషయంలో షూటింగ్‌తో పాటు సమాంతరంగా సాంకేతిక పనులను కూడా పూర్తి చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు కావాల్సిన సమయాన్ని రాజమౌళి తెలివిగా సద్వినియోగం చేసుకుంటారు.
ఇలా చేయడం వల్ల `వారణాసి` అనుకున్న సమయానికి విడుదల కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయడం అన్నది చిన్న టాస్క్ కాదు. రిలీజ్ కు సంబంధించి గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయితే రాజమౌళి లాంటి లెజెండ్ కు అదేం పెద్ద పని కాదు. ఆస్కార్ తో అంతర్జాతీయంగా తనకున్న గుర్తింపుతో అనుకున్న గొప్పగా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తారు.