శీనులకు అచ్చి రాని సంక్రాంతి
అదేంటో సినిమా పరిశ్రమలో కొన్ని కాకతాళీయంగా జరిగినా ఏదో సెంటిమెంట్ వల్ల జరిగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అందులోనూ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉన్న తరుణంలో ఇలాంటివి ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. అలాంటిదే ఇది కూడా. గత ఏడాది సంక్రాంతికి జనవరి 10న వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఎంత దారుణంగా నిరాశ పరిచిందో ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఏడాది గడిచింది అంటూ ఆ విషాదాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ గుర్తు చేసుకున్నారు. అది బాబాయ్ సినిమా.
ఇప్పుడు అబ్బాయి వంతు వచ్చింది. దానికేమాత్రం తీసిపోని రీతిలో వినయ విధేయ రామ రిపోర్ట్స్ వస్తుండటంతో బయ్యర్లకు టెన్షన్ మొదలై పోయింది. డివైడ్ టాక్ డిజాస్టర్ గా మారకూడదని కోరుకుంటున్నారు. అది తేలడానికి ఎక్కువ రోజులు పట్టదు. మొదటివారం అయ్యే లోపు క్లారిటీ వచ్చేస్తుంది.అయితే ఇక్కడ సెంటిమెంట్ ఏముంది అనుకుంటున్నారా. అజ్ఞాతవాసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే షార్ట్ కట్ లో శీను. ఆల్రెడీ అదే పేరుతో మనకు డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎవరూ అలా పిలవరు.
వినయ విధేయ రామకు కెప్టెన్ బోయపాటి శీను. అంటే బాబాయ్ కి గత ఏడాది ఒక శీను ప్లాప్ ఇస్తే ఇప్పుడు ఈ సంక్రాంతికి అబ్బాయికి మరో శీను ఝలక్ ఇచ్చాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు సార్లు బాలయ్య బరిలో ఉన్నాడు. అప్పుడు జైసింహ కమర్షియల్ గా సేఫ్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ లో స్లోగా పికప్ అయ్యే పనిలో ఉంది. సో మెగా హీరోలకు చెరొక శీను ప్లాప్ ఇచ్చారన్న చర్చ అభిమానుల మధ్యే జరుగుతోంది. కొన్నిఅంతే. అలా జరిగిపోతాయి
Full View