• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమాలకు మాంద్యం దెబ్బ...

సినిమాలకు మాంద్యం దెబ్బ లేదట..!

By - Tupaki Desk
Update: 2019-10-09 08:40 GMT
ఆర్థికమాంద్యం దెబ్బకు గతంలో ఎన్నడూ లేనంతగా మోడీ ప్రభుత్వం కుదేలవుతోంది. అందుకే  బ్యాంకులు - దేశ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు ఉద్దీపనల మీద ఉద్దీపనలు ప్రకటించేస్తోంది. అయితే ఎంత చేసినా మాంద్యం దెబ్బకు దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి పరిస్థితులు అయితే మెరుగుపడడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇంత మాద్యం లోనూ సినిమాలు మాత్రం ఆడేస్తున్నాయి. కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి సినిమా రంగానికి ఆర్థిక మాంద్యం దెబ్బ లేదే లేదన్నది సినిమా వ్యాపారంలో ఉన్న వారి మాట..

తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం పీవీఆర్ సినిమాస్ సీఈవో జ్ఞాన్ చందాని  మాంద్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం వల్ల సినిమా పరిశ్రమ మాత్రం సంతోషంగా ఉందని.. మా వ్యాపారం బాగుందని.. సమస్యలైతే ఏమీ లేవని స్పష్టం చేశారు. సినిమా కంటెంటో లేక మరేదో కానీ సినీ వ్యాపారం మాత్రం లాభాల్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలు అధికంగా చూస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. మాంద్యంపై అపోహలు సృష్టిస్తున్నారని.. సినీ పరిశ్రమకు మాత్రం మాంద్యం వరంగా మారిందన్నారు.

పీవీఆర్ సినిమాస్ సంస్థ తొలి త్రైమాసికంలో భారీగానే లాభాలు సాధించింది. ఏకంగా 43 రెట్లు ఆదాయాన్ని పొందింది. వరల్డ్ కప్ నడిచిన సమయంలోనూ పీవీఆర్ సంస్థ 20శాతం లాభాలు పొందిందట.. ఇదే సమయంలో చైనాలో మాత్రం పరిస్థితి తలకిందులైంది. అక్కడ మాంద్యం దెబ్బకు ప్రముఖ సినిమాల సంస్థ వాండా ఫిల్మ్ హోల్డింగ్ కంపెనీ భారీగా నష్టాలపాలైంది.

ఇప్పుడు దేశంలో డిజిటల్ డేటా విప్లవం వచ్చాక అమేజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ లలో సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు అసలు జనాలు రాక సినిమా పరిశ్రమ కుదేలవుతోంది. ఇలాంటి సమయంలో కూడా పీవీఆర్ లాభాల వ్యాపారం చేయడం విశేషం. దీన్ని బట్టి సినిమాలు అధికంగా చూస్తున్నారని.. సినిమాలకు మాంద్యం ముప్పు లేదని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

   

Tags:    
  • Economical Crisis 
  • Film Industry 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS