డోనరుడుకి డొనేషన్స్ అందుకునే ఛాన్స్

Update: 2016-10-29 05:10 GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు వెలవెలబోతోంది. దసరాకి వచ్చిన ప్రేమమ్ తర్వాత టికెట్ కౌంటర్లను కళకళలాడించే సినిమాలేవీ రాలేదు. కళ్యాణ్ రామ్-పూరీల కాంబినేషన్ లో వచ్చిన ఇజం మెరుపులు.. వీకెండ్ కే పరిమితమయ్యాయి. ఈ వారం వచ్చిన డబ్బింగ్ సినిమా కాష్మోరాకు రిలీజ్ రోజే యావరేజ్ టాక్ వచ్చింది. శనివారం థియేటర్లను పలకరిస్తున్న ధర్మయోగిని చూస్తే.. ఇప్పటికే తమిళ్ కోడికి యావరేజ్ టాక్ ఉంది.

సడెన్ గా భారీ సినిమా ఏదైనా రిలీజ్ కి ప్లాన్ చేస్తే మినహాయిస్తే.. రామ్ చరణ్ మూవీ ధృవ డిసెంబర్ లో వచ్చేవరకూ.. బాక్సాఫీస్ దుమ్ము దులిపేసే చిత్రం ఏదీ లేదు. ఈ మధ్యలో రానున్నవన్నీ.. లో- మీడియం బడ్జెట్ సినిమాలే కాగా.. వచ్చే వారం రిలీజ్ కానున్న స్పెర్మ్ డోనర్ పై ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో ఉన్న సినిమాలేవీ ఫేర్ చేయలేకపోవడం.. చెప్పుకోదగ్గ పోటీ కూడా లేకుండా విడుదల అవుతుండడంతో.. ఈ స్పెర్మ్ డోనర్ సినిమాకు కలిసొచ్చే విషయం.

సుమంత్ చాలా కాలం తర్వాత చేస్తున్న ఈ మూవీ.. కామెడీ పరంగా హిందీ వెర్షన్ లో మంచి మార్కులు వేయించుకుంది. తెలుగులో కూడా ఈ విషయంలో మంచి మార్కులు పడితే.. ఇక బాక్సాఫీస్ దుమ్ము దులిపేసేయచ్చు. కామెడీ ఒక్కటి పండిందంటే.. డోనర్ కి డొనేషన్స్.. అదేనండీ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద విషయమేం కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News