కొంచెం తగ్గాలమ్మా నివేధా

Update: 2018-04-25 06:50 GMT
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి హీరోయిన్ అయినా కూడా అందంగా కనిపించడానికే చాలా ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా ఫిట్ నెస్ లో వారు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. సమయానికి లేవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. డైట్ లో చాలా ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కష్టపడే ఇష్టం ఉండాలి. కానీ ఈ మధ్య కొందరి హీరోయిన్స్ ఫిజిక్ లో ఊహించని మార్పులు వస్తున్నాయి. మొన్నటి వరకు ఎంతో అందంగా కనిపించిన భామలు సడన్ గా చబ్బీ లుక్స్ తో కనిపిస్తున్నారు.

మరికొందరైతే మరి బరువెక్కిపోతున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం నిత్యా మీనన్ ఉన్నారు. ఆమె మొదట్లో ఎలా ఉండేవారో అందరికి తెలిసిందే. గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేయడం లేదు కదా అనుకుందో ఏమో గాని ఫిజిక్ గురించి ఆలోచనను వదిలేసింది. చివరగా అ! సినిమాలో అమ్మడు లావుగా అనిపించింది. ఇక ఇప్పుడు అదే తరహాలో మరో హీరోయిన్ తయారవుతోంది. నిన్ను కోరి సినిమాతో ఒక్కసారిగా కుర్రకారు మనసును దోచేసిన నివేత థామస్ ఆ తరువాత జై లవకుశ సినిమాతో మంచి అవకాశం అందుకుంది.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో నటించడానికి రెడీ అయ్యింది. గుహన్ దర్శకత్వంలో తెరకెక్క నున్న ఆ సినిమా ఈ రోజే లాంచ్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫొటోలను చూస్తుంటే నివేత కొంచెం లవాయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో సడన్ గా ఇలా దర్శనమివ్వడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిత్యా మీనన్ మంచి టాలెంటెడ్ యాక్టర్. కానీ ఇలా బరువేక్కే ఆఫర్స్ ను అందుకోలేదు. ఇప్పుడు నివేత కూడా అలానే అవుతుండడం చూస్తుంటే అమ్మడికి నెక్స్ట్ ఆఫర్స్ రావడం కష్టమే మరి.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
Tags:    

Similar News