నేను చేసింది వాళ్ల లైఫ్ మొత్తంలో చేయలేరు అంటున్న నితిన్ బ్యూటీ

Update: 2020-07-04 04:15 GMT
అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న తన వెబ్ సిరీస్ "బ్రీత్ 2: ఇంటు ది షాడోస్" విడుదల కోసం హీరోయిన్ నిత్యామీనన్ చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తోంది. నిత్య తెలుగులో చివరగా కనబడిన సినిమా ఎన్టిఆర్ కథానాయకుడు. ఆ సినిమాలో అమ్మడు సావిత్రి పాత్ర పోషించింది. ఆ టైంలో నిత్య తమిళ సినిమాలతో పాటు తన ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ "మిషన్ మంగల్"తో అక్కడ కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం బ్రీత్ ప్రమోషన్ల లో భాగంగా నిత్యామీనన్ మీడియాతో మాట్లాడింది. అలాగే తన గురించి.. తన లావు గురించి మాట్లాడే వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చింది. “నా బాడీ గురించి ఎవరైతే విమర్శిస్తున్నారో.. నేను ఇంతవరకు చేసింది కూడా వారి లైఫ్ మొత్తం లో చేయ లేరు. అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ల జీన్స్.. ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు బరువు పెరగడాని కి కారణం అవుతాయని గ్రహించ లేరు.

మరి నేనెందుకు బరువు బరువు పెరుగుతున్నానో ఎవరు అడగట్లేదు. ఎందుకని? అంటూ ప్రశ్నించింది. అసలు ఏమి జరుగుతుందో తెలియకుండా.. నిజాలపై అవగాహన లేకుండా ప్రజలను నమ్మిస్తూ మమ్మల్ని ట్రోల్ చేయాలని చూస్తున్నారు" అని నిత్య మాట్లాడింది. ఇక తన సినిమాల విషయం కూడా మాట్లాడింది బ్యూటీ. "నేను నాకు దొరికే ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా.. నాకు సంతోషం కలిగించే పాత్రలను ఎంచుకోవడం మొదలు పెట్టాను. అంతేగాక నేను నాకు సూట్ అవుతాయని భావించినవే చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఇక నా శరీరం గురించి నేనెప్పుడూ సిగ్గుపడటం లాంటివి చేయ లేదు. జనాలు అలాగే ఇష్ట పడుతున్నారని అంటోంది. నిత్య ప్రస్తుతం తెలుగు లో ఏ సినిమా ఓకే చేయ లేదని సమాచారం. మరి అమ్మడు చూస్తే బొద్దు గా తయారైందనే కామెంట్స్ పై అలా స్పందించింది.
Tags:    

Similar News