• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ కోసం రిజిస్టర్...

నితిన్ కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ తో సత్యదేవ్ సినిమా...!

By - Tupaki Desk
Update: 2020-08-26 17:00 GMT
'జ్యోతిలక్ష్మి' 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ - మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతోన్న చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. కన్నడ హిట్ మూవీ ''లవ్ మాక్ టైల్'' చిత్రానికి రీమేక్‌ గా రానున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న పూజా కార్యక్రమాలతో ప్రారభించనున్నారు. ఇటీవల ఈ చిత్ర టైటిల్ లోగోతో పాటు హీరోయిన్ తమన్నా లుక్‌ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

కాగా 'గుర్తుందా శీతాకాలం' టైటిల్ పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ టైటిల్ నితిన్ సినిమా కోసం పెట్టాల్సిందని తెలుస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ - మేఘా ఆకాష్ కాంబోలో 'చల్ మోహన రంగా' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీని అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి కో ప్రొడ్యూసింగ్ చేసారు. అయితే ఈ సినిమాకి ముందుగా 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. కానీ చివరి నిమిషంలో 'చల్ మోహన రంగా' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఆ టైటిల్ అలానే ఉండిపోయింది. దీంతో దర్శకనిర్మాత నాగశేఖర్ 'గుర్తుందా శీతాకాలం' టైటిల్ కోసం త్రివిక్రమ్ సంప్రదించగానే ఆ టైటిల్ ఇచ్చేశారని తెలుస్తోంది. అప్పుడెప్పుడో నితిన్ కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్ ఇప్పుడు సత్యదేవ్ కి ఉపయోగపడింది.
Tags:    
  • Satya Dev 
  • Nithin 
  • Gurthunda Seethalalam 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS