నితిన్ - చైతన్య `పవర్ పేట` టాప్ సీక్రెట్స్
యూత్ స్టార్ నితిన్ పెళ్లి తర్వాత కెరీర్ పరంగా మరింత స్వింగ్ లోకి వెళ్లాడు. రెట్టించిన ఉత్సాహంతో పెండింగ్ షూటింగులు పూర్తి చేస్తూ కొత్త సినిమాల్ని పట్టాలెక్కించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవలే రంగ్ దే మరో షెడ్యూల్ పూర్తయింది. శరవేగంగా మొత్తం షూటింగ్ పూర్తి చేస్తామని టీమ్ ప్రకటించింది.
ఇక ఇదే ఉత్సాహంలో ఉన్న నితిన్ తదుపరి చంద్రశేఖర్ ఏలేటి సహా గేయ రచయిత టర్న్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్టుపైనా సీరియస్ గా దృష్టి సారించాడని సమాచారం. `పవర్ పేట` పేరుతో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ డ్రామాకి ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇంతకుముందు నితిన్ చల్ మోహన్ రంగా తెరకెక్కించిన కృష్ణ చైతన్య ఈసారి ఎలాంటి మిస్టేక్ లేకుండా స్క్రిప్ట్ పరంగా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
తాజా సమాచారం ప్రకారం.. పవర్ పేట వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ను ప్రారంభిస్తారని లీకులందాయి. ఎలూరు- రాజమండ్రి- మైసూర్ లో చిత్రీకరణ సాగనుంది. `రంగ్ దే`లో నితిన్ తో కలిసి పని చేసిన కీర్తి సురేష్ `పవర్ పేట`లోనూ నితిన్ సరసన నటించనుంది. ఇప్పటికే ప్రముఖ స్వరకర్త మణిశర్మ పాటల కంపోజిషన్ పని ప్రారంభించారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.