నిశ్శబ్దం.. శబ్దం చేస్తుందా?
తెలుగులో కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకున్న అమ్మాయి అనుష్క. ఆమె పేరు మీద లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే ఆడాయి. చివరగా ‘భాగమతి’తోనూ ఆకట్టుకుంది అనుష్క. దాని తర్వాత ఆమె బాగా టైం తీసుకుని, ఆచితూచి చేసిన సినిమా ‘నిశ్శబ్దం’. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ ఏడాది జనవరి నెలాఖర్లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఏప్రిల్ 1న రిలీజ్ అనుకుంటే ఈలోపు కరోనా వచ్చి పడింది. గత కొన్ని నెలల్లో ‘నిశ్శబ్దం’ ఓటీటీ రిలీజ్ గురించి ఎంతో చర్చ నడిచింది. ముందు ఆ ప్రచారాన్ని ఖండించిన చిత్ర బృందం.. చివరికి ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి అంగీకరించింది. అధికారిక ప్రకటనా చేసేసింది. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకు అక్టోబరు 2న అనే కానీ.. ఇంతకుముందు ప్రైమ్‌లో రిలీజైన సినిమాల్లాగే దీన్ని కూడా ముందు రోజు రాత్రి 9-10 గంటల మధ్య విడుదల చేసేసే అవకాశముంది.
ఈ సినిమా మొదలైనపుడు, మేకింగ్ దశలో ఎంతో చర్చనీయాంశం అయింది కానీ.. ఆలస్యం కావడం వల్ల కావచ్చు, ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడం వల్ల కావచ్చు.. రిలీజ్ ముంగిట అయితే సినిమాకు ఆశించిన బజ్ లేదు. పెద్దగా శబ్దం చేయకుండానే ‘నిశ్శబ్దం’ విడుదలవుతోంది. ఐతే కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న చిత్ర బృందం రిలీజ్ తర్వాత ఈ సినిమా చర్చనీయాంశం అవుతుందని ఆశిస్తోంది. ఇంతకుముందు ‘వస్తాడు నా రాజు’ లాంటి మామూలు సినిమా, పైగా ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అతణ్ని నమ్మి అనుష్క, మాధవన్ లాంటి ఆర్టిస్టులు ఈ సినిమాను ఒప్పుకోవడమే ఆశ్చర్యమంటే.. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ముందుకు రావడం షాక్. హేమంత్‌ను నమ్మి నిర్మాతలూ పెద్ద బడ్జెట్ కూడా పెట్టారు. మరి ఇంతమంది నమ్మకాన్ని హేమంత్ ఏమేర నిలబెడతాడు.. ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది అన్నది ఆసక్తికరం.