నిఖిల్ సినిమాకు బ్రేక్ ఇచ్చారా.. ఆపేశారా?

Update: 2019-03-08 05:00 GMT
'శ్వాస' సినిమా టైటిల్ గుర్తుందా?  నిఖిల్ సిద్ధార్థ్ - నివేద థామస్ జంటగా లాస్ట్ ఇయర్ దసరా పండగ సమయంలో లాంచ్ చేసిన చిత్రం ఇది.  కిషన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి తెరకెక్కించాల్సి ఉంది.  అప్పటికే 'అర్జున్ సురవరం'(ఆ సమయానికి టైటిల్ 'ముద్ర') షూటింగ్ దాదాపుగా పూర్తయింది.  జస్ట్ మూడు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని.. తక్కువ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కిస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకూ ఆ సినిమాపై మరో అప్డేట్ లేదు.

తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్లో ఒక రూమర్ వినిపిస్తోంది.  ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారని.. ప్రాజెక్ట్ ఇక లేనట్టేనని అంటున్నారు. నిఖిల్ ప్రస్తుతం 'అర్జున్ సురవరం' రిలీజ్ పనులలో బిజీగా ఉన్నాడు.   'అర్జున్ సురవరం' రిలీజ్ తర్వాత  'శ్వాస' ను మళ్ళీ పట్టాలెక్కించే అలోచన ఏమైనా ఉందా లేదా అనేది 'అర్జున్ సురవరం' ప్రమోషన్స్ సమయంలోనిఖిల్ ఏమైనా అఫిషియల్ గా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే నిఖిల్ లాస్ట్ సినిమా 'కిరాక్ పార్టీ' పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తన కొత్త సినిమా 'అర్జున్ సురవరం' తో విజయం సాధించి మళ్ళీ హిట్ ట్రాక్ పైకి వస్తానని నిఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.  నిఖిల్ కాన్ఫిడెన్స్ కు తగ్గట్టే ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది.  సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
Tags:    

Similar News