ముద్ర ఫ్రెష్ లుక్.. ఫ్రెష్ టైటిల్ ఇదే

Update: 2019-02-04 08:11 GMT
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం రేకెత్తడంతో ఫిలింమేకర్స్ టైటిల్ ను మార్చారు.  'ముద్ర' ను 'అర్జున్ సురవరం' గా మార్చి కొత్త టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు.  

ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ ఫ్రెష్ లుక్.. ఫ్రెష్ టైటిల్ ఇదేనని.. అందరికీ చెప్పండి అని ట్వీట్ చేశాడు. ఫ్రెష్ లుక్ పోస్టర్లో నిఖిల్ ఒక మూవింగ్ వ్యాన్ నుండి బయటకు వేలాడుతూ కెమెరాతో ఏదో షూట్ చేస్తూ ఉన్నాడు.  పోస్టర్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేదిగా ఉంది.  ఈ సినిమాలో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.  'అర్జున్ సురవరం' కథ ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం...

ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళ సినిమా 'కణిదన్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టీఎన్ సంతోష్ దర్శకుడు. మూవీ డైనమిక్స్.. అరా సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు సమర్పకుడు.    షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మార్చ్ 29 న విడుదల చేస్తున్నారు. 
Tags:    

Similar News