సాంగ్ టాక్‌: తమన్నా కత్తిలా ఉంది

Update: 2018-05-18 11:43 GMT

టాలీవుడ్ హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమే.. కాస్త గ్లామర్ డోస్ ఎక్కువైనా కూడా ఆడియేన్స్ తిప్పి కొట్టేస్తారు. ఆ విధమైన రిజల్ట్ ఎదుర్కొన్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు. ఇక గత కొన్నేళ్లుగా గ్లామర్ ను చాలా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ తనదైన శైలిలో ఫెమాస్ అవుతోన్న బ్యూటీ తమన్నా.  మిల్కీ బ్యూటిగా తన అందాలకు సరికొత్త బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ రీసెంట్ గా మరోసారి రచ్చ చేసింది.

చాలా రోజుల తరువాత తమన్నా కత్తిలా ఉంది అనేలా టాక్ తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ తో నా నువ్వే అనే సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజమా మనసా అంటూ తమన్నా అరబోసిన హాట్ అందాలు నెటీజన్స్ మతి పొగోడుతున్నాయ్. సరికొత్త డ్యాన్స్ లో ప్రయోగాత్మకమైన స్టెప్పులతో అలరించింది.

లెగ్స్ అందాల వైపు అందరి చూపు కదిలేలా మిల్కీ బ్యూటీ చేసిన విధానం సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. చూస్తుంటే సినిమాలోని ఫుల్ సాంగ్ లో కూడా అమ్మడు ఇరగదిసినట్లు ఉండవచ్చని అర్ధమవుతోంది. ఇక నా నువ్వే సినిమా మే 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.



వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News