• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీక్రెట్స్ బయటపెట్టిన...

సీక్రెట్స్ బయటపెట్టిన ఇస్మార్ట్ అగర్వాల్...!

By - Tupaki Desk
Update: 2020-05-02 23:30 GMT
నిధి అగర్వాల్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిచయం అవసరంలేని ఇస్మార్ట్ హీరోయిన్. 'మున్నామైఖెల్‌'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా టాలీవుడ్ లో తన పేరు గుర్తుండిపోయేలా చేసాయి. గత ఏడాది డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఒక సినిమాలో.. తమిళ్ లో జయం రవి సరసన 'భూమి' చిత్రంలో నటిస్తోంది. యూత్ లో ఆమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ వయ్యారాలు ఒలకబోసే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండగా ఇంట్లోనే ఉన్న నిధి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ మేరకు అనేక ఆసక్తికర విషయాలకు వెల్లడించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా ఇస్మార్టుగా ఆన్సర్స్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె చెప్పిన కొన్ని సమాధానాలతో ఫోన్‌ లోని సీక్రెట్స్ బయట పడ్డాయి. ఈ మేరకు స్క్రీన్ లాక్ పిక్.. వాట్సప్ డీపీ.. చివరగా వాడిన యాప్ ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నిధి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ ఇంటర్‌లో ఎంత పర్సెంటీజీ వచ్చిందని అడగ్గా.. 87 శాతం అని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అందమే కాదు.. చదువుల్లోనూ నిధి పాప ఇస్మార్టే అని తెలుస్తోంది. ఈ విధంగా తన ఫాల్లోవెర్స్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి తన వంతుగా సహాయం చేసింది. ఎంత విరాళం ఇచ్చిందో చెప్పకపోయినా పీఎం కేర్ ఫండ్.. వెల్ఫేర్ అఫ్ స్ట్రే డాగ్స్.. కరోనా క్రైసిస్ ఛారిటీ.. సీఎం రిలీఫ్ ఫండ్.. స్ఫూర్తి సంక్షేమ సేవా సంఘ్ మొదలైన వాటికి కంట్రిబ్యూట్ చేసినట్లు నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీంతో తన మంచి మనసుని చాటుకుని అందరి హృదయాలను గెలుచుకుంది.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS