రొమాన్స్‌ కోరుకుంటున్న ఇస్మార్ట్‌ హీరోయిన్‌

Update: 2019-07-20 08:11 GMT
'సవ్యసాచి' మరియు 'మిస్టర్‌ మజ్ను' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిధి అగర్వాల్‌ తాజాగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇస్మార్ట్‌ శంకర్‌ లో నిధి అగర్వాల్‌ సైంటిస్ట్‌ పాత్రలో కనిపించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు.. స్కిన్‌ షో తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీకి మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో నిధి అగర్వాల్‌ సంతోషంగా ఉంది.

తాజాగా ఒక మీడియా సంస్థతో చిట్‌ చాట్‌ చేసిన నిధి అగర్వాల్‌ తనకు రొమాంటిక్‌ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. రొమాంటిక్‌ సినిమాల్లో నటించమంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని... నాకు ఇష్టమైన రొమాంటిక్‌ సినిమాల్లో ఎక్కువగా నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎక్స్‌ పోజింగ్‌ విషయంలో అడ్డు అదుపు లేదు అంటూ ఈ మాటలతో నిధి అగర్వాల్‌ హింట్‌ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం చేయడంతో పాటు మరో చిత్రం చర్చల దశలో ఉందని.. తెలుగులో రెండు సినిమాలు చేయబోతున్నట్లుగా నిధి చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News