సినిమా కోసం వెంకటేష్.. శ్రీదేవి కోసం ఆర్జీవి..!

Update: 2022-12-25 04:42 GMT
అప్పట్లో ఆర్జీవి సినిమా కోసం పెట్టిన డెడికేషన్ వేరే లెవల్లో ఉండేది. ఇప్పుడంతా అమ్మాయిల తొడల మీద అతని దృష్టి మారింది కానీ కెరీర్ స్టార్టింగ్ లో తను అనుకున్న కథ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు అక్కడ ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా స్టార్ హీరోయిన్ అయినా కొండల్లో కోనల్లో ఎండల్లో వానల్లో అలా వారిని నేచురల్ గా షూట్ చేసేవాడు. విక్టరీ వెంకటేష్ తో క్షణ క్షణం సినిమా తీశాడు వర్మ. ఆ సినిమా టైం లోని ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ సినిమాలో ఒక రోజు రాత్రి మొత్తం ఫారెస్ట్ లో గడుపుతారు వెంకటేష్, శ్రీదేవి ఆ టైం లో తీసిన పిక్ అనుకుంటా అందరు కింద కూర్చుని ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఫోటోలో అందరు నవ్వుతున్నట్టు కనిపించినా.. ఆల్రెడీ అప్పటికే శ్రీదేవి అంటే పిచ్చి ఇష్టం ఉన్న ఆర్జీవి ఆమె పక్కన కూర్చుని తన్మయత్వంలో ఉన్నట్టు ఉన్నాడు. వెంకటేష్ ఏమో సినిమా కోసం థింక్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇక వీరిద్దరిని చూసి శ్రీదేవి కూడా సైలెంట్ గా తన ఆలోచన ఏదో తను ఆలోచిస్తుంది. అయితే వెనకాల మాత్రం కెమెరా మెన్ ఎస్. గోపాల్ రెడ్డి మాత్రం వీరిని ఫోటో తీస్తున్న వ్యక్తి వైపు చూస్తున్నారు.    

మొత్తానికి ఒకప్పటి ఈ ఫోటో చూస్తే అందులో ఉన్న వారికి తమ పాత జ్ఞపకాలు గుర్తుకు రావడం కామన్. ఆర్జీవి తీసిన అప్పటి సినిమాలన్ని ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం లాంటిది. కానీ అప్పటి ఆర్జీవి ఇప్పుడు లేడు. ఇప్పుడు మనోడంతా అమ్మాయిల తొడలు చూపించడం.. కాళ్లు చప్పరించడం లాంటివి చేస్తున్నాడు. అంత గొప్ప దర్శకుడిని ఇలా చూసి ఆయన ఫ్యాన్స్ కూడా చీదరించుకుంటున్నారు.

ఎన్ని తిట్టుకున్నా సరే ఆయన తీసిన సినిమాలు.. ఇదిగో ఇలా ఆ సినిమాల్లో ఏవో ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే అతను చేసిన ప్రయోగాలు గుర్తుకొస్తాయి. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ఆర్జీవి ఇప్పుడిలా తయారయ్యాడేంటి అని వాపోతున్నారు. క్షణ క్షణం ఆన్ లొకేషన్ ఫోటో చూసిన ప్రేక్షకులు అప్పట్లో వారి డెడికేషన్ చూసి హ్యాట్సాఫ్ అనేస్తున్నారు.


Tags:    

Similar News