#నిహారిక.. హబ్బీతో రొమాన్స్ ఆ రేంజులో..!
నిహారిక కొణిదెల హైదరాబాద్ కు చెందిన టెక్కీ చైతన్య జెవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో ట్రెండింగ్ అయ్యాయి. నిహారికా -చైతన్య వివాహ ఆల్బమ్ నుండి మరిన్ని అద్భుతమైన చిత్రాలను తాజాగా ఇన్ స్టా లో షేర్ చేశారు. వీటిలో కొన్ని హల్ది వేడుక నుండి వచ్చినవి కాగా మరికొన్ని ప్రత్యేక ఫోటోషూట్ నుండి బయటికి వచ్చాయి.
నిహారిక కొణిదెల డిసెంబర్ 9 న ఉదయపూర్ లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు. ఆమె తన సోదరుడు వరుణ్ తేజ్ తో తన తల్లి పద్మజా కొనిదేలాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
హబ్బీ చైతన్య జెవితో రొమాంటిక్ ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేయగా వాటిని యువతరం వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లితో నిహారిక మునుపెన్నడూ లేనంత హ్యాపీగా కనిపిస్తోంది. ఆ గ్లో తన అందాన్ని పదింతలు చేసిందంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కావడం.. ఏ ప్రేమికురాలికి సాధ్యం కానిది తాను సాధించుకోవడంతో ఆ కాన్ఫిడెన్స్ నిహారికలో కనిపిస్తోందన్నది అభిమానుల మాట. తన పెళ్లి ఆల్బమ్ లో ప్రతి ఫోటోలోనూ ఈ సంతోషం ప్రతిబింబిస్తోందని విశ్లేషిస్తున్నారు.