• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెకండ్ పార్ట్ లో న్యూ...

సెకండ్ పార్ట్ లో న్యూ పుష్ప రాజ్

By - Tupaki Desk
Update: 2022-09-03 15:30 GMT
పుష్ప 1తో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం ముందుగానే సుకుమార్ తో ప్రత్యేకంగా స్క్రిప్టు చర్చల్లో కూడా భాగమైన అల్లు అర్జున్ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. మొత్తానికి సుకుమార్ అయితే సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ తో మెప్పించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా పనులను మొదలుపెట్టారు.

ఇక రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ విషయంలో కొన్ని మార్పులు చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో గుబురు గడ్డంతో అల్లు అర్జున్ ఏ విధంగా కనిపించడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఈసారి మాత్రం ఆ లుక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని తెలుస్తోంది. పుష్ప 1లో గుబురు గడ్డంతోనే తగ్గేదేలే అంటూ బన్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఈసారి మరి అంత ఎక్కువ గడ్డం కాకుండా అలాగే కొంత మీసాలు కూడా తగ్గించి మాస్ లోనే కాస్త స్టైలిష్ గా కొత్త లుక్ ట్రై చేయబోతున్నట్లు సమాచారం.

అలాగే సెకండ్ పార్ట్ లో డిఫరెంట్ మ్యానరిజం కూడా ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఇచ్చిన సలహాలకు బన్నీ తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక పూర్తిస్థాయిలో అయితే న్యూ లుక్ పై సుకుమార్ సంతృప్తి చెందుతున్నట్లు సమాచారం. ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలైన తర్వాత ఒక డిఫరెంట్ లుక్ విడుదల చేయబోయే అవకాశం కూడా ఉంటుందట.

ఏదేమైనా కూడా ఫస్ట్ పార్టీ కంటే సెకండ్ పార్ట్ లో పుష్ప రాజ్ చాలా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక మేకింగ్ లో సుకుమార్ కి మరింత స్వేచ్ఛను ఇస్తూ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హిందీ మార్కెట్ను ఈసారి ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కేవలం 10 కోట్లకు అమ్మేసి తొందరపడిన నిర్మాతలు ఈసారి మాత్రం డిమాండ్ ను బట్టి హిందీలో 100 కోట్లకు పైగానే డీలింగ్ సెట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమా ఫైనల్ గా ఎలాంటి రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Pushpa 
  • AlluArjun 
  • StylishStar 
  • IconStar 
  • Sukumar 
  • RashmikaMandanna 
  • PanIndia 
  • NewPushpaRaj 
  • SecondPart 
  • TupakiNews 
  • MovieNews 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS