కొత్త సినిమా.. స్టైలిష్ లుక్.. పవన్‌ పిక్స్ వైరల్‌

Update: 2023-01-30 11:09 GMT
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇదే సమయంలో సాహో సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు పవన్‌ ఇటీవలే ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ నేడు ప్రారంభం అయ్యింది. ఒక తమిళ సినిమాకు ఇది రీమేక్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్.. సురేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

బ్లాక్‌ అండ్ బ్లాక్ లో డిఫరెంట్ హెయిర్‌ స్టైల్ తో పాటు స్టైలిష్ ఔట్ ఫిట్ తో పవన్‌ కళ్యాణ్‌ లుక్ భలే ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదో రాజకీయ పార్టీ కార్యక్రమానికి హాజరు అవుతున్నాను అన్నట్లుగా కాకుండా సినిమా కార్యక్రమానికి ఇలా స్టైలిష్ గా హాజరు అవ్వడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కు సంబంధించిన విషయాలను త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా లో హీరోయిన్‌ ఎవరు.. ఇతర విషయాలు ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

పూజా కార్యక్రమాలకు థమన్ హాజరు అయ్యాడు. దాంతో ఈ సినిమా కు సంగీతాన్ని థమన్ అందించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దానయ్య ఆశ పడుతున్నాడట. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News