కొత్త స్టిల్: పుష్పరాజ్ నవ్వితే ముత్యాలు రాలును!
పుష్పరాజ్ అంటే మాస్ .. ఊరమాస్ ట్రీట్ అనే అనుకుంటుంటే ఇప్పుడు అతడిలోని కొత్త కోణం కనిపిస్తోంది. గుబురు గడ్డం.. కోర మీసం మాసిన జుత్తు.. గళ్ల పంచె కట్టు.. ఇలాంటి ఆహార్యం చూస్తేనే ఇంత ఊరమాస్ రౌడీనా? అనుకుంటాం కానీ.. అతడు కూడా నవ్వుతాడు.
స్వచ్ఛంగా నవ్వితే పుష్పరాజ్ ఎలా ఉంటాడో ఈ కొత్త లుక్ చెబుతోంది. బన్ని నెవ్వర్ బిఫోర్ మాస్ లుక్ ఒక వైపు అనుకుంటే.. ఈ క్లాస్ నవ్వు మరో కోణం అనుకోవాలి.
ప్లెజెంట్ గా అలా టెంట్ హౌస్ కుర్చీల మీద కూకుని అంత ధీమాగా నవ్వేస్తున్నాడేంటో కానీ.. అక్కడ ఎవరున్నారు? అంటే.. ఒకవేళ శ్రీవల్లీ ఏవైనా ఫ్రేమ్ లో ఉందా? అన్న సందేహం కలగక మానదు.
అడవుల్లో గంధపు చక్కల స్మగ్లింగ్ ఎలా? అన్న సమాలోచనలు చేయడం లేదు కానీ... తీరిక వేళ ఇలా సరదాగా భార్యామణితో ఏమైనా మాట్లాడుతున్నాడో ఏమో ప్లెజెంట్ పుష్పరాజ్ కనిపిస్తున్నాడు. సెట్స్ లో అలా తీరిక చిక్కగానే ఏదో ముచ్చటిస్తున్నట్టుగా క్యాజువల్ గానూ కనిపిస్తోంది వాలకం.
ఇంతకీ ఆ సన్నివేశం ఏదై ఉంటుందో కానీ... ప్లెజెంట్ గా మాంచి సాంగ్ ఏస్కుంటాడో ఏమో కూడా చెప్పలేం. సుకుమార్ దర్శకత్వంలో సంథింగ్ స్పెషల్ గా తెరకెక్కి పాన్ ఇండియా కేటగిరీలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
డిసెంబర్ 17 ముహూర్తం ఫిక్స్ చేశారు కాబట్టి ప్రచారంలోనూ వేగం పెంచింది టీమ్. డిసెంబర్ 4న ప్రీరిలీజ్ ఈవెంట్- ట్రైలర్ లాంచ్ తో పుష్ప రేంజ్ ఒక్కసారిగా స్కైని టచ్ చేయనుంది. ప్రభాస్ ముఖ్య అతిథిగా డిసెంబర్ 4 సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ భారీగా జరగనుంది. ఈ వేదికపై పుష్ప టోటల్ టీమ్ ప్రత్యక్షమవుతుందని సమాచారం.