• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లూడో' సాంగ్: మొహ‌మాటం...

'లూడో' సాంగ్: మొహ‌మాటం అన్న‌దే లేకుండా చెల‌రేగిన కొత్త‌మ్మాయ్

By - Tupaki Desk
Update: 2020-10-22 11:50 GMT
కొత్త‌మ్మాయ్ ఇంట్ర‌డ్యూస్ అవుతోంది అంటే ఎక్క‌డ మొహ‌మాట ప‌డిపోతుందోన‌ని కుర్ర‌కారు కంగారు ప‌డిపోతారు. కానీ ఆ కంగారు ఎక్క‌డా ఈ కొత్తమ్మాయ్ లో క‌నిపించ‌డం లేదు. పెద‌వి ముద్దులు అయినా బెడ్ రూమ్ సీన్స్ అయినా కుర్ర‌హీరోల‌తో రొమాన్స్ ని చిత‌కేసింది మ‌రి. ఎక్క‌డా మొహ‌మాటం అన్న‌ది క‌నిపించ‌లేదు. సిగ్గు బిడియం అస‌లే లేవ్. ఏమిటో కానీ ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం.. ఇంత‌కీ ఏం పేరు? న‌ట‌వార‌సురాలేనా? అంటే.. ఆ రెండు అర్హ‌త‌లు ఉన్న‌మ్మ‌డే. పేరు స‌న్యా మ‌ల్హోత్రా. బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ స‌హా ఇటు ఖాన్ ల కుటుంబాల‌తో అంబానీల ఫ్యామిలీస్ తో బాగా స‌న్నిహితంగా మెలిగే అమ్మ‌డే. పార్టీ క్రౌడ్ లో నిరంత‌రం వేడెక్కించే అమ్మ‌డే.

అనురాగ్ బసు చిత్రం `లూడో`లో న‌టించింది స‌న్యా. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన‌ చమత్కారమైన ట్రైలర్ ‌లోనూ మెరిపించిన ఈ బ్యూటీ ఫుల్ లెంగ్త్ సాంగ్ లో రొమాన్స్ పీక్స్ లో చూపించింది. అభిషేక్ బచ్చన్,.. ఆదిత్య రాయ్ కపూర్,.. రాజ్ కుమార్ రావు... ఫాతిమా సనా షేక్ .. సన్యా మల్హోత్రా.., పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన మల్టీస్టారర్ డార్క్ కామెడీ ఇది. ఈ ట్రైలర్ అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించగా.. మేకర్స్ ఈ చిత్రం నుండి మొదటి పాటను ఈ రోజు విడుదల చేశారు. దీనికి అబాద్ బార్బాద్ అని పేరు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పాట మొదటిసారి స్క్రీన్ స్థలాన్ని పంచుకుంటున్న ఆదిత్య - సన్యాపై పిక్చ‌రైజ్ చేసారు. ఈ పాట‌లో ఆదిత్య - సన్యా జంట‌ సిజ్లింగ్ కెమిస్ట్రీ ని ఎలివేట్ చేసింది.

అబాద్ బార్బాద్ గీతం అరిజిత్ సింగ్ మనోహరమైన స్వరంతో ఆక‌ట్టుకుంది. “జీవితం నిజంగా లూడో ఆట లాంటిది! కొన్నిసార్లు ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్నిసార్లు నిరంతరం ముందుకు కదులుతుంది. మీరు ప్రతిదీ గెలుస్తారు.. లేదా మీరు ప్రతిదీ పూర్తిగా కోల్పోతారు! ” అన్న అర్థంతో లిరిక్ మైండ్ లో ఇంకిపోతుంది. లూడో నాలుగు కథలు .. మునుపెన్నడూ లేని విధంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన గేమ్ చుట్టూ తిరుగుతుంది. అనురాగ్ నాలుగు కథలను వినోదం అనే ఏకైక ఉద్దేశ్యంతో కలిపార‌ట‌. చిత్రం ఆద్యంతం మలుపులతో నిండిన హై-ఆక్టేన్ గేమ్ అనిపిస్తుంది. భూషణ్ కుమార్- దివ్య ఖోస్లా కుమార్- క్రిషన్ కుమార్- అనురాగ్ బసు - తాని బసు సంయుక్తంగా నిర్మించారు., లూడో నవంబర్ 12 న డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ ‌లో విడుదల కానుంది.


Full View
Tags:    
  • Movies 
  • Movie News 
  • Latest news 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS