2020లో ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన మూవీ టర్మ్...?

Update: 2020-05-08 01:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇళ్లలో బంధీ అయిందని చెప్పవచ్చు. దీంతో ఖాళీగా ఉన్న జనాలు ఇంటర్నెట్ తో కాలక్షేపం చేస్తున్నారు. వారికి తెలియని వాటి గురించి సెర్చ్ ఇంజిన్ 'గూగుల్' లో సెర్చ్ చేసి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్ వాడకంలో ఎప్పుడు ముందుండే మన ఇండియన్స్ కరోనా కారణంగా ఇంకొంచెం ఎక్కువసేపు ఇంటర్నెట్ తో గడుపుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ ఒక్కటే అన్నిటికి మార్గం అనే విధంగా తయారైంది. టైంపాస్ కోసం ప్రతీ దాన్ని గూగులింగ్ చేస్తున్నారు. అయితే 2020లో ఇప్పటి వరకు గూగుల్ లో ఎక్కువగా ఇండియన్స్ సెర్చ్ చేసిన మూవీ టర్మ్ ఏంటో తెలుసా..? గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టర్మ్ ''హారర్ మూవీస్'' (Horror Movies). ఆ తర్వాత ఎక్కువ మంది గూగుల్ చేసిన మూవీ టర్మ్ ''బెస్ట్ తెలుగు మూవీస్ 2020'' (Best Telugu movies 2020). ''హారర్ మూవీస్'' కోసం 950% సెర్చ్ చేయగా ''బెస్ట్ తెలుగు మూవీస్ 2020'' అని 450% గూగుల్ లో వెతికారు.

ప్రజెంట్ జనరేషన్ లో అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లోనే లాక్ అవడంతో అందరూ టైంపాస్ కోసం హారర్ మూవీస్ మరియు తెలుగు సినిమాలను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు అర్థం అవుతోంది. వాస్తవానికి ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమాల స్థాయి పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మన తెలుగు సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతెందుకు మన తెలుగు సినిమాలను డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేస్తే వారు ఎగబడి చూస్తున్నారు. మన ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాలు సైతం వేరే ఇండస్ట్రీల వారు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని చెప్పవచ్చు.

మూవీస్ గురించి పక్కన పెడితే గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టర్మ్ 'కరోనా ఇన్సూరెన్స్' 1230% తో టాప్ మోస్ట్ సెర్చ్ చేసిన టర్మ్ గా నిలిచింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరోనా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారని అర్థమవుతోంది. అలాగే ఎక్కువ మంది గూగులింగ్ చేసిన వస్తువులు 'కిరాణా ఐటమ్స్' అని తెలుస్తోంది. ఆన్ లైన్ షాపింగ్ లో భాగంగా ఎక్కువమంది గ్రాసరీ ఐటమ్స్ కోసం వెతికినట్లు తెలుస్తోంది. అయితే ఎడ్యుకేషన్ కి సంభందించి గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేయలేదని తెలుస్తోంది. కాకపోతే ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఎడ్యుకేషన్ కి సంబంధించినవి వెతికినట్లు తెలిపారు. అంతేకాకుండా యూపీఐ పిన్ చేంజ్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్.. బిల్ పేమెంట్స్ మొదలైనవి కూడా 2020లో ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన టర్మ్స్ గా నిలిచాయి.
Tags:    

Similar News